పచ్చని పైరుతో కనువిందు

మంచాల : వరుణుడు కరుణించి సకాలంలో వర్షాలు కురియడంతో వాగులు వంకలు పొంగిపొర్లాయి. దీంతో వ్యవసాయ బోరు బావుల్లోకి పెద్ద ఎత్తున నీరు రావడంతో వానకాలం పంటను భారీగా సాగు చేశారు. మంచాల మండలంలోని వివిధ గ్రామాల్లో ఉన్న బోరుబావుల కింద సుమారు 4వేల ఎకరాల్లో వరి సాగు చేయడంతో ఎటు చూసిన పచ్చని పొలాలతో కనువిందు చేస్తున్నాయి. రెండు సంవత్సరాల క్రితం వర్షాలు సమృద్ధిగా కురియకపోవడంతో వరి సాగుపై రైతులు మక్కువ చూపలేదు.
ఈ వానకాలం పంటకు అనుకున్న స్థాయిలో వర్షాలు కురియడంతో అధిక మొత్తంలో వరి సాగు చేశారు. ప్రతి రైతుకు పంటసాగు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి రూ. 5వేల చొప్పున పంటపెట్టుబడి సాయం అందజేస్తుంది. సబ్సిడీపై ఎరువుల, విత్తనాలను వ్యవసాయ బావులకు 24గంటల ఉచిత విద్యుత్‌ను అందజేస్తున్నది. గతంలో కంటే ఈసారి మండలంలో అత్యధిక స్థాయిలో వరి సాగు చేయడంతో మండలంలోని ఎల్లమ్మతండా నుంచి లోయపల్లి వరకు పచ్చని పొలాలతో కనుచూపు మేరలో చూపరులకు కనువిందు చేస్తున్నాయి. పంటపొలాలను చూస్తూ రైతన్నలు ఆనందంతో మురిసిపోతున్నారు. మంచాల మండలంలో 3వేల వ్యవసాయ బావుల కింద 4వేల 2వందల ఎకరాల వరి పంటతో పాటు ఇతర పంటలను సాగుచేశారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

