ప్రతి పక్షాలను బొంద పెట్టాలి
ఈ ఎన్నికల్లో ప్రతి పక్షాలను బొంద పెట్టాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని సామ నర్సింహా రెడ్డి ఫంక్షన్ హాలులో కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
- రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
- రాష్ర్టానికి బీజేపీ చేసేందేమీ లేదు
- కాంగ్రెస్, బీజేపీలకు ప్రజలు బుద్ధి చెప్పాలి
కందుకూరు, అక్టోబర్ 27 : ఈ ఎన్నికల్లో ప్రతి పక్షాలను బొంద పెట్టాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని సామ నర్సింహా రెడ్డి ఫంక్షన్ హాలులో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అంతకు ముందు హైదరాబాద్, శ్రీశైలం రహదారిపై టపాసులు కలుస్తూ, పూలవర్షం కురిపించి మంత్రికి స్వాగతం పలుకుతూ.. ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… రాష్ర్టానికి బీజేపీ చేసేందేమీలేదన్నారు.
ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్, బీజేపీల అభ్యర్థులకు బుద్ధి చెప్పాలని ప్రజలకు సూచించారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలకు కండ్లు మండుతున్నాయన్నారు. దేశానికి అన్నం పెట్టే స్థాయికి రాష్ట్రం ఎదిగిందని, దీనికంతటికి కారణం సీఎం కేసీఆర్ అని కొనియాడారు. ప్రజలు, రైతులు కాంగ్రెస్ పార్టీని నమ్మి మోసపొవద్దని కోరారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అమలు చేస్తున్నారా? అని ప్రశ్నించారు. కరెంట్, తాగునీరు, అభివృద్ధి, సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న మనం కాంగ్రెస్ చేతుల్లోకి పోతే ఆగం కావాల్సి వస్తుందన్నారు. వందేండ్ల ప్రగతిని సీఎం కేసీఆర్ 10ఏండ్లలో చేసి చూపించాలరని వివరించారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

