సాంకేతిక రంగంలో ముందున్న భారత్
సాంకేతిక రంగంలో నేడు భారత్ దూసుకుపోతున్నదని.. దానికి చంద్రయాన్-3 ముఖ్యకారణమని రంగారెడ్డి జడ్పీచైర్‌పర్సన్ తీగల అనితారెడ్డి అన్నారు.
- దానికి చంద్రయాన్-3 ముఖ్యకారణం
- రంగారెడ్డి జడ్పీచైర్‌పర్సన్ అనితారెడ్డి
- విద్యారంగానికి అధిక ప్రాధాన్యం : ఎమ్మెల్యే రంగారెడ్డి
- గురుకుల విద్యాపీఠంలో ఘనంగా ప్రారంభమైన జిల్లాస్థాయి సైన్స్ విజ్ఞాన సదస్సు
ఇబ్రహీంపట్నం రూరల్, జనవరి 9 : సాంకేతిక రంగంలో నేడు భారత్ దూసుకుపోతున్నదని.. దానికి చంద్రయాన్-3 ముఖ్యకారణమని రంగారెడ్డి జడ్పీచైర్‌పర్సన్ తీగల అనితారెడ్డి అన్నారు. మంగళవారం ఇబ్రహీంపట్నం సమీపంలోని గురుకుల విద్యాపీఠంలో జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్‌కు ఎమ్మెల్సీ ఏవీఎన్‌రెడ్డి, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్‌తో కలిసి ఆమె జ్యోతి వెలిగించి ప్రారంభించి మాట్లాడారు. మానవ జీవితం సైన్స్‌తో ఎంతో ముడిపడి ఉన్నదని..విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడుతాయన్నారు. విద్యార్థులు చిన్నతనం నుంచే కష్టపడి చదివి తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల్లోని ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహించాలన్నారు.
అనంతరం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ విద్యారంగాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. సైన్స్ పరిజ్ఞానంతో మానవ జీవితం ముడిపడి ఉన్నందున ప్రతి ఒక్కరూ సాంకేతిక రంగంపై దృష్టి సారించాలన్నారు. చంద్రయాన్-3 ప్రయోగంతో భారత్ ఎంతో ఘనకీర్తిని సాధించిందన్నారు. విద్యార్థులు విభిన్నంగా ఆలోచించాలన్నారు. అనంతరం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏవీఎన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో సరైన వసతుల్లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. విద్యావ్యవస్థను పటిష్టం చేయాలని ప్రభుత్వానికి సూచించారు. ప్రభుత్వ బడుల్లో వసతుల కల్పనకు ఎమ్మెల్సీ సీడీపీ నిధులను కేటాయిస్తానని తెలిపారు.
జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ మాట్లాడుతూ సైన్స్ అంటేనే తెలుసుకోవడం అని, ఒక్క చిన్న ప్రశ్న నుంచే ఎంతో మేథోమధనం జరిగి కొత్త ఆవిష్కరణలు వస్తాయని.. విద్యార్థులందరూ ఇలాంటి విశ్లేషణాత్మక ఆలోచనలను బాల్యదశ నుంచే అలవాటు చేసుకుని భవిష్యత్తు శాస్త్రవేత్తలుగా ఎదగాలన్నారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులకు పలు రకాల ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. మొక్కలకు సంబంధించిన విషయంపై శ్రీనిధి అనే విద్యార్థినిని ప్రశ్నించగా ఆమె సరైన సమాధానం చెప్పడంతో సర్ప్రైజ్ బహుమతిని జడ్పీచైర్‌పర్సన్, ఎమ్మెల్యే చేతుల మీదుగా చిన్నారికి జిల్లా అదనపు కలెక్టర్ అందజేశారు. జిల్లా నుంచి పెద్ద ఎత్తున హాజరైన విద్యార్థులు 300 రకాల నమూనాలను ప్రదర్శించగా.. వాటిని జడ్పీచైర్‌పర్సన్, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, అదనపు కలెక్టర్, డీఈవో సుశీందర్‌రావు తిలకించారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఎంపీపీ కృపేశ్, మున్సిపల్ చైర్పర్సన్ కప్పరి స్రవంతి, జడ్పీటీసీ మహిపాల్, ఎంఈవో వెంకట్‌రెడ్డి, గురుకుల విద్యాపీఠం ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌రావు, జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాస్‌రావు, డీసీఈబీ సెక్రటరీ రాంచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా గురుకుల విద్యాపీఠం ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌రావును ముఖ్య అతిథులు అభినందించారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road Accident | కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రుల సంతాపం..బాధిత కుటుంబాలను ఆదుకుంటాం
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ ఆరోగ్యంపై ఆందోళన.. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
Jailer 2 | 200 మంది అమ్మాయిలతో ‘తలైవా’ డ్యాన్స్.. థియేటర్లలో ఆ సీన్స్ మిస్!
Ranabaali | రణబాలి బాక్సాఫీస్ సెన్సేషన్.. వర్కింగ్ డేలోనూ అదరగొట్టిన విజయ్ దేవరకొండ!
Rowdy-sheeter | పోలీసింగ్ ఎక్కడ? ఏం చేస్తారో చేసుకోండన్న యువకుడు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

