ఇబ్రహీంపట్నంలో కార్డెన్ సెర్చ్

ఇబ్రహీంపట్నం : సంఘ వ్యతిరేఖ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యల తప్పవని ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్ అన్నారు. శనివారం ఇబ్రహీంపట్నంలోని వెంకటరమణ, అంబేద్కర్‌నగర్ కాలనీల్లో ఇబ్రహీంపట్నం ఏసీపీ యాదగిరిరెడ్డి, ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 300మంది పోలీసులతో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ మాట్లాడుతూ నేరాల అదుపునకు ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని కోరారు.
సీసీ కెమెరాల వలన పౌరులకు కలిగే ప్రయోజనాలను పోలీసులు వివరించాలని తెలిపారు. ముఖ్యంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్న తరువాత నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందన్నారు. సీసీ కెమెరాల ద్వారా అనేక నేరాలను చేదించడం జరిగిందని నేరస్తులు కూడా తప్పించుకోలేకపోతున్నారన్నారు. నాగార్జునసాగర్ – హైదరాబాద్ రహదారిపై తరుచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. అలాగే, వాహనాలు నడిపేవారు లైసెన్స్‌లు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు.
కార్డెన్‌సెర్చ్‌లో పట్టుబడిన అక్రమ నిల్వలు
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని పలు కాలనీల్లో శనివారం నిర్వహించిన కార్డెన్ సెర్చ్‌లో పెద్ద ఎత్తున అక్రమ నిల్వలు బయటపడ్డాయి. ఈ సందర్భంగా పోలీసుల తనిఖీల్లో 31 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలు, టాటా ఏసీలు, 920 నిషేధిత గుట్కాప్యాకెట్లు, 109అక్రమ మధ్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు. కార్యక్రమంలో ఏసీపీలు యాదగిరిరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, సీఐలు సైదులు, వెంకటేష్‌గౌడ్‌తో పాటు ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

