కేంద్రంలో ఇండియా కూటమిదే ప్రభుత్వం
కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రావడం ఖాయమని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. సోమవారం పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో ఓటు వేసిన అనంతరం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
- తెలంగాణలో కాంగ్రెస్‌కు 14 సీట్లు ఖాయం
- బీజేపీతో శాంతి భద్రతలకు భంగం
- పార్లమెంటు ఎన్నికలు కాంగ్రెస్‌కు రెఫరెండం
- విలేకరుల సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి
కొడంగల్, మే 13 : కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రావడం ఖాయమని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. సోమవారం పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో ఓటు వేసిన అనంతరం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని నరేందర్మోదీకి 75 సంవత్సరాలు నిండనున్నాయని, ఏజ్ లిమిట్ అమలు చేస్తే ఎవరు ప్రధాని అనేది బీజేపీ తేల్చుకోవాలని సవాల్ విసిరారు. బీజేపీ 336 సీట్లలో మాత్రమే పోటీ చేస్తున్నదని, 400ల సీట్లు రావడం ఏ విధంగా సాధ్యమని ప్రశ్నించారు. దీన్ని బట్టి చూస్తే.. దేశంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో 400 సీట్లు ఖాయమని బీజేపీ నాయకులు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 13 ఏండ్లు సీఎంగా, 10 సంవత్సరాలు పీఎంగా పనిచేసిన మోదీ, మన రాజ్యాంగాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేదని ఎద్దేవా చేశారు. దేశంలో మతరపమైన రిజర్వేషన్లు లేవని, సామాజికంగా వెనుబడినవారికి మాత్రమే దేశంలో రిజర్వేషన్లు అమలులో ఉన్నట్లు గుర్తు చేశారు.
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఏపీలో ఇండియా కూటమి ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. ఇండియా కూటమి పేరుతో మేము ప్రజలను ఓట్లు అడుగుతుంటే, మోదీ పేరుతో బీజేపీ ఒట్లు అడుతుతున్నట్లు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌కు ఆదానీ, అంబానీ నుంచి డబ్బులు వచ్చాయని చెప్పడంపై సవాల్ విసురుతున్నానని.. ఈడీ, సీబీఐ, ఐటీ అధికారులను పంపి అంబానీ, ఆదానీ ఇండ్లు, ఆఫీసుల్లో సోదాలు నిర్వహించాలని పేర్కొన్నారు. మోదీ ఆరోపణలు నిజమైతే ఎందుకు వారిపై చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. రైతుబంధు ఏ విధంగా అమలు చేశామో, వచ్చే పంద్రాగస్టులోగా రైతు రుణమాఫీ చేసి తీరుతామని హామీ ఇచ్చారు. పార్లమెంటు ఎన్నికలను మా వందరోజుల పాలనకు రెఫరెండంగా తీసుకుంటున్నామని పేర్కొన్నారు. బీజేపీతో శాంతి భద్రతలకు భంగం వాటిల్లనుందని, పెట్టుబడులను గుజరాత్‌కు తరలించుకోవాలని బీజేపీ కుట్ర పనుతున్నట్లు ఆరోపించారు. యూపీలో నెలకొన్న పరిస్థితిని తెలంగాణలో తీసుకురావాలని బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు. కార్యక్రమంలో మహబూబ్‌నగర్ పార్లమెంటు అభ్యర్థి వంశీచందర్‌రెడ్డి, ఎంపీపీ ముద్దప్ప దేశ్‌ముఖ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశాంత్, ఎండీ యూసుఫ్, కృష్ణంరాజు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

