నేడు సీఎం రేవంత్‌రెడ్డి రాక
అబ్దుల్లాపూర్‌మెట్ పరిధిలోని లష్కర్‌గూడకు నేడు సీఎం ఎనుముల రేవంత్‌రెడ్డి రానున్నారు. బీసీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కల్లు గీత కార్మికులకు అందించనున్న ‘కాటమయ్య రక్షణ కవచం’ కిట్ల పంపిణీకి ఆదివారం ఉదయం 11 గంటలకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు.
- లష్కర్‌గూడలో ‘రక్షణ కవచం కిట్ల్లు’ పంపిణీకి శ్రీకారం చుట్టనున్న సీఎం
- సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే రంగారెడ్డి, కలెక్టర్ శశాంక
అబ్దుల్లాపూర్‌మెట్, జూలై 13 : అబ్దుల్లాపూర్‌మెట్ పరిధిలోని లష్కర్‌గూడకు నేడు సీఎం ఎనుముల రేవంత్‌రెడ్డి రానున్నారు. బీసీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కల్లు గీత కార్మికులకు అందించనున్న ‘కాటమయ్య రక్షణ కవచం’ కిట్ల పంపిణీకి ఆదివారం ఉదయం 11 గంటలకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. దీనికి సంబంధించిన సభ స్థలాన్ని రాష్ట్ర రవాణా,
బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, కలెక్టర్ శశాంక శనివారం పరిశీలించడంతోపాటు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. వారి వెంట ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ దశరథ, సూపరింటెండెంట్ ఉజ్వలారెడ్డి, ఆర్డీవో అనంతరెడ్డి, తహసీల్దార్ రవీందర్దత్తు, ఎల్బీనగర్ డీసీపీ చల్లా ప్రవీణ్‌కుమార్, వనస్థలిపురం ఏసీపీ కాశీనాథ్‌రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ నవీన్‌రెడ్డి, సీఐ అంజిరెడ్డి, ఎక్సైజ్ సీఐ ధన్వంత్‌రెడ్డి, ఆయా శాఖల అధికారులు, నాయకులు ఉన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

