అంగన్వాడీల సమస్యలు పరిష్యరించాలి
అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజు ప్రభుత్వాన్ని కోరారు. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లతో కలిసి సోమవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు.
- సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజు
షాద్‌నగర్‌టౌన్, జూలై 15 : అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజు ప్రభుత్వాన్ని కోరారు. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లతో కలిసి సోమవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు.
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీల వేతనాన్ని రూ.18వేలకు పెంచడంతో పాటు పీఎఫ్ సౌకర్యం కల్పిస్తామని చెప్పడం జరిగిందన్నారు. జీవో ఎంఎస్ నం.10ని రద్దు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్‌గా అంగన్వాడీ టీచర్లకు రూ.2లక్షలు, హెల్పర్లకు లక్ష ఇస్తూ జీవోను జారీ చేయాలన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా వ్యతిరేక విధానాలను మాత్రం వేగవంతంగా అమలు చేస్తుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అంగన్వాడీల సమస్యలను అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి పరిష్కరించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు శ్రీనూనాయక్, సీఐటీయూ కేశంపేట మండల కన్వీనర్ శ్రీనివాస్, అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల ప్రాజెక్టు నాయకులు జయమ్మ, ఊర్మిళ, సంగీత, సుజాత, మమత, హేమలత, వీణ, అనసూయ, శోభారాణి, జ్యోతి, నర్సమ్మ, జయమ్మ, శ్రీదేవి, ఇందిర, ఉమ, రాజ్యలక్ష్మి, తులసి, వినోద, సంతోష, భాగ్యలక్ష్మి, అరుణ పాల్గొన్నారు.
సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలి
సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే శంకర్ వైద్యాధికారులకు సూచించారు. పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో సోమవారం డిప్యూటీ డీఎంహెచ్‌వో డా.విజయలక్ష్మి, వైద్యాధికారులు, సిబ్బందితో సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలన్నారు. ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడుతూ వైద్య సేవలను అందించాలన్నారు. దవాఖానలపై ఎలాంటి విమర్శలు రాకుండా చూసుకోవాలని, 102, 108 వాహనాలను నిరంతరం అందుబాటులో ఉంచుకోవాలన్నారు.
గ్రామీణ ప్రాం తాల్లో కార్యదర్శులతో సమన్వయం చేసుకొని సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అత్యవసర వైద్య సేవలకు సంబంధించిన అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచుకోవాలని, ఏవైనా మందులు అవసరమైతే తన దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో వైద్యాధికారులు రాఘవేందర్, నిఖిత, హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాసులు, హెల్త్ సూపర్వైజర్లు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | రామ్ – రావణ్ వైభవాన్ని బిగ్ స్క్రీన్‌పై చూడాల్సిందే.. ‘రామాయణ’ సినిమాపై సందీప్ రెడ్డి వంగా ప్రశంసలు
Scene | సూర్య ‘సీన్’ ఓటీటీ రిలీజ్ టైం ఫిక్స్ .. నెట్‌ఫ్లిక్స్‌లో ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కానుందంటే!
Kamareddy | కామారెడ్డి జిల్లా జిల్లాలో విషాదం.. కుంటలో పడి తండ్రి, కూతురు మృతి
Vijay Sethupathi | విజయ్ సేతుపతికి అరుదైన గౌరవం.. తొలి భారతీయ నటుడిగా ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డుల వేదికపై చరిత్ర!
KTR | ఒకే ఫ్రేమ్‌లో కేటీఆర్, సీఎం విజయ్, వైఎస్ జగన్.. ఫొటోలు వైరల్!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

