Bhupalapally : జెన్కో భూ సేకరణను వేగవంతం చేయండి.. కలెక్టర్ భవేశ్ మిశ్రా

భూపాలపల్లి రూరల్ : జెన్కో భూ సేకరణను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ జెన్కో గెస్ట్‌హౌస్‌లో జెన్కో భూ సేకరణపై రెవెన్యూ, జెన్కో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో శ్రీనివాస్ జెన్కో సంస్థకు అవసరమైన భూమి, ఇప్పటి వరకు సేకరించిన భూ వివరాలను తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ, జెన్కో అధికారులు సమన్వయంతో జెన్కోకు అవసరమైన భూ సేకరణ కార్యక్రమాన్ని వేగవంతం చేసి భూ సేకరణ పూర్తి చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న దుబ్బపల్లి యాష్ డంపింగ్ స్థలం, కేటికే నుంచి చేల్పూర్ మీదుగా జెన్కో వరకు కన్వేయర్ బెల్ట్, తాడిచర్ల నుంచి జంగేడు మీదుగా జెన్కో వరకు కన్వేయర్ బెల్ట్, కొంపెల్లి, గుడాడ్‌పల్లిలో నూతనంగా భూ సేకరణ, కాపురం గ్రామానికి పునరావాసం తదితర పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేసి బాధితులకు నష్టపరిహారం చెల్లించి నిర్వాసితులకు త్వరగా పునరావాసం కల్పించి భూ సేకరణను పూర్తి చేయాలని కలెక్టర్ అన్నారు.
కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ టీఎస్ దివాకర్, జెన్కో సీఈ సిద్ధయ్య, కలెక్టరేట్ సూపరింటెండెంట్ రవికుమార్, భూపాలపల్లి, గణపురం, మల్హర్రావు మండలాల తహసీల్దార్లు ఇక్బాల్, సతీశ్‌కుమార్, శ్రీనివాస్, జెన్కో అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | కరువు మండలాలు ప్రకటించడం తప్ప సహాయంపై చేతులెత్తేసిన రేవంత్ : మాజీ మంత్రి హరీష్‌రావు
PCOS | పీసీఓఎస్ సమస్య మహిళల్లో అసలు ఎందుకు వస్తుంది.. ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..?
Rising Stars Asia Cup: రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌కు తిలక్ వర్మ కెప్టెన్సీ.. జట్టులో అభిషేక్, వైభవ్
RJD Somireddy | విద్యా ప్రమాణాల పెంపునకు సమష్టి కృషి చేయాలి : ఆర్జేడీ సోమిరెడ్డి
Sharad Pawar | శరద్ పవార్‌కు ఛాతిలో నొప్పి.. పూణె ఆసుపత్రిలో చేరిక, నిలకడగా ఆరోగ్యం
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

