హైవేపై గ్యాస్ ట్యాంకర్ బోల్తా
విజయవాడ జాతీయ రహదారిపై ఓ భారీ గ్యాస్ ట్యాంకర్ బోల్తాపడింది. అందులో నుంచి గ్యాస్ లీక్ అవుతున్నట్టు జరిగిన ప్రచారంతో జనం పరుగులు తీశారు.
- తప్పిన ప్రమాదం.. భారీగా ట్రాఫిక్ జాం
- ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టిన పోలీసులు
పెద్దఅంబర్‌పేట, జనవరి 3 : విజయవాడ జాతీయ రహదారిపై ఓ భారీ గ్యాస్ ట్యాంకర్ బోల్తాపడింది. అందులో నుంచి గ్యాస్ లీక్ అవుతున్నట్టు జరిగిన ప్రచారంతో జనం పరుగులు తీశారు. ఈ ఘటన అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. దాదాపు 35 టన్నుల బరువైన గ్యాస్ ట్యాంకర్ చైన్నై నుంచి గుజరాత్ వెళ్తున్నది.
విజయవాడ జాతీయ రహదారి నుంచి మిర్యాలగూడ రోడ్డు వైపు వెళ్తుండగా.. అబ్దుల్లాపూర్‌మెట్‌లో అదుపుతప్పి డివైడర్‌కు తగిలి నడిరోడ్డుపై బోల్తాపడింది. సమాచారం అందుకున్న మెట్టు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
స్వల్పంగా గాయపడ్డ గ్యాస్ ట్యాంకర్ డ్రైవర్‌ను చికిత్స కోసం దవాఖానకు తరలించారు. ట్యాంకర్ రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. చిన్నపాటిగా గ్యాస్ లీక్ అవడంతో జనం భయభ్రాంతులకు గురయినప్పటికీ.. ఆ తర్వాత లీకేజీ ఆగిపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ట్యాంకర్‌ను పక్కకు తొలగించేందుకు పోలీసులు పెద్దఎత్తున చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ సమస్య పెద్దది కాకుండా, వాహనదారులు ఇబ్బందులకు గురికాకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

