షాబాద్, మే 24 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు పథకం జిల్లాలో జోరుగా కొనసాగుతున్నది. ఆయా గ్రామాల్లో నిర్వహిస్తున్న క్యాంపులకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తున్నది. రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 80 బృందాల ద్వారా ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాల్లో మొత్తం 10,727 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 431 మందికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. 568 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాల కోసం ఆర్డర్ చేశారు.
బొంరాస్పేట : వికారాబాద్ జిల్లాలో వైద్య బృందాలు అప్పటికప్పుడే పరీక్షలు నిర్వహించి చుక్కల మందుతో పాటు విటమిన్ మాత్రలు పంపిణీ చేస్తున్నారు. బుధవారం 5095 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. 408 మందికి రీడింగ్ గ్లాసులు పంపిణీ చేయగా, 504 మందికి అద్దాలను ఆర్డరిచ్చారు. జిల్లాలో ఇప్పటివరకు 489 గ్రామాలు, 90 వార్డుల్లో వైద్య శిబిరాలను నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.