ఎలాంటి కట్టుబాట్లూ లేకుండా, కుటుంబాన్ని పట్టించుకోకుండా విచ్చలవిడిగా తిరిగే మహిళను ఉద్దేశించి చెప్పిన సామెత ఇది. మాఘమాసంలో చలి ఎక్కువ. తులలో మొదలైన చలి, వృశ్చికంలో పెరిగి, ధనుస్సులో మనుషులను విల్లులా వంచేసి, మకరంలో ఉండ చుట్టుకు పోయేట్టు చేస్తుందని లోకోక్తి. చలి ఉండొచ్చు కానీ, వానపడటం మాత్రం మాఘమాసం లక్షణం కాదు. కానీ, ఒక్కోసారి మాఘంలో వాన పడుతుంది. అదీ విరామం లేకుండా దంచికొడుతుంది. బాధ్యత లేకుండా వ్యవహరించే జాణల స్వభావాన్ని మాఘపు వానలతో పోలుస్తారు జానపదులు.