‘ఇగ మా ఇంటి గురించి పెద్దగా చెప్పేదేం లేదు.. మా పెద్దోడు గోదసుంటోడు తొంబదోలి పోతడు. ఇక చిన్నోని సంగతి మీ అందరికీ ఎర్కేనాయె.. లంగల సోపతి చేసి.. వాడు కూడా లంగయిండు’ అంటుంటారు. ఈ పదబంధంలో గోదసుంటోడు అంటే.. గోమాత అంత ఓపిక కలిగినవాడు అని. తొంబదోలు అంటే అత్యంత సాధారణంగా, ఏదైనా చూసి చూడనట్లు, పెద్దగా పట్టించుకోని స్వభావం ఉన్నవాడు అని అర్థం.
ఇంటికి పెద్దలు చాలా విషయాలు చూసిచూడనట్లు వదిలేస్తుంటారు. చిన్నవారు ఎవరైనా తప్పులు చేసినా ఇట్టే క్షమిస్తారు. చిన్నవారైనా, పెద్దవారైనా.. ఉన్నతస్థితిలో ఉంటూ కల్మషం లేకుండా చాలా సాదాసీదాగా బతుకుతూ, సాధారణ జీవితం గడిపే వ్యక్తులను తొంబదోలు అంటారు. అయితే, మారిన జీవన విధానంతో ఈ కాలం పిల్లల్లో చాలావరకు ఓపిక, ఎదుటివారిని క్షమించే గుణం తగ్గిపోయాయి.