కొందరు ఇష్టాయిష్టాలను మాటల్లో వ్యక్తపరిస్తే.. ఇంకొందరు చేతల్లో వెల్లడిస్తారు. అలాంటివారిని పసిగట్టమంటూ జానపదులు చెప్పిన సామెత ఇది. ఒక్కొక్కరి స్వభావం ఒక్కోలా ఉంటుంది. ఏ ఇద్దరూ ఒకేలా ఆలోచించరు. కొందరేమో నచ్చితే ఎదుటివారితో అల్లుకుపోతారు. నచ్చకపోతే, పరోక్షంగా చేతల్లో వ్యక్తపరుస్తారు. ఈ అభివ్యక్తి కూడా ఒక్కొక్కరిదీ ఒక్కోలా ఉంటుంది.
తెలంగాణ సంస్కృతిలో గొప్పతనం ఏంటంటే.. ఎవరైనా తమ చేతల ద్వారా మనపై అయిష్టతను చూపినా.. మనమే ఓ అడుగు ముందుకేసి కలుపుకొని వెళ్లే ప్రయత్నం చేస్తాం. ‘మల్ల మాయింటికి రావొద్దనుకుంటాన్లా? కచ్చితంగా మారన్నం తినాల్సిందే’ అంటూ పట్టుబట్టి మరీ రెండోపాలి అన్నం పెడతారు. అదీ మన ఆప్యాయత అంటే. అయినోళ్లు సుత బంధాలు తెంపుకొని.. మారన్నం తినకుండా వెళ్తే.. వడ్డించేవారికి తృప్తి ఉండదు.