1. కడ్లు = గేదె పేడ/ఆవుపేడ (పొద్దు నెత్తికొత్తాంది..
ఎక్కడోల్లక్కడే పండిర్రు. బర్ల కొట్టంల కడ్లు ఎవ్వడు తీస్తడు. పాలేరులెక్క నేనే పొద్దంత జెయ్యాల్నా?)
2. ఇచ్చంత్రం = విచిత్రం/ విచిత్రమైన (ఏందిరుల్లో.. ఆ మాత్రానికే అట్ల ఇచ్చంత్రమైందా? ఇక ముందుంది ముసల్ల పండగేనట)
3. శిమాంట = తొలిసారి/ఆది/మొదటి (శిమాంట (శుభమాంట) ఇంట్ల ఆడవిడ్డ పుట్టింది. ఎంత అదృష్టమో బిడ్డ. లచ్చిందేవి పుట్టినట్టే ఉన్నది. మీ బాధలు బందయినయిపో..)
4. దడి = ప్రహరీ లాంటిది/బాత్రూమ్ వంటిది/ అడ్డుగా ఉన్నది (తానం బోసుకుందామంటే కనీసం దడి కూడా లేదాయె. నేనెట్ల
పోను అత్తారింటికి..)
5.సలిపారం = పోషమ్మకు పెట్టే నైవేద్యం (అంతా సిద్ధంజేసిర్రు కదా.. సలిపారం మర్చిపోకుర్రి..అవ్వకు కోపమత్తది)