‘వీడొట్టి నీసు ముచ్చొడు.. ఐతారం వస్తే చాలు.. సర్వలక్లెల్లి మూతి తియ్యనే తియ్యడు.. అవసరమైతే బొక్కలు మెడలేస్కొని తిర్గుతడు’ అంటుంటారు పల్లెల్లో. మాంసాహార వ్యసనం ఉన్న వ్యక్తిని నీసు ముచ్చోడు అని వ్యవహరిస్తారు.
వీరికి నీసు లేనిదే ముద్ద దిగదు. వారమంతా నాన్‌వెజ్‌తో పెట్టినా మారు మాట్లాడకుండా తింటారు. గుడ్లు మొదలు.. జలపుష్పాలు, మటన్, చికెన్ వంటివి ఇష్టంగా ఆరగిస్తారు. కాబట్టే, ‘మెతుకు మేనత్త, నీసు కన్నతల్లి’ అన్నారు.