అత్యాశపరులను ఉద్దేశించిన సామెత ‘అగడువడ్డోడు ఐనంవోతే.. ఉన్న బోళ్లన్ని తోమి బోర్లిచ్చిండ్రట’. అగడుపడటం అంటే బాగా ఆకలిమీద ఉండటం.. ఇష్టంగా తినాలని ఆశపడటం. అంతటి ఆశ ఉన్న వ్యక్తి ఐనం (పెండ్లికి) పోతే అప్పటికే.. వండిన (బోళ్లు) గిన్నెలు, తిన్న గిన్నెలు అన్నీ శుభ్రంగా తోమి బోర్లపడేశిండ్రట. దీంతో ఉసూరుమంటూ తిరుగుప్రయాణం అయ్యాడట. మనం ఎంతలా ఆశపడితే.. అంతలా భంగపడతామని హెచ్చరించే సామెత ఇది.