‘తిరిగి తిరిగొచ్చి దేవుని మడి ఎందుకు కోసిర్రు’ అన్నడట!
మాటలతో కాలం వెళ్లబుచ్చుతూ.. రుబాబు చేస్తూ బతుకుతుంటారు కొందరు. పనిచెయ్యడం చేతగాని వ్యక్తులు.. కష్టపడే వారిపైనే పెత్తనం చేసే సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు. ఈ తరహా మనుషులు ఎదుటి వ్యక్తుల పనిలో వంకలు వెతుకుతుంటారు.
మాటలతో కాలం వెళ్లబుచ్చుతూ.. రుబాబు చేస్తూ బతుకుతుంటారు కొందరు. పనిచెయ్యడం చేతగాని వ్యక్తులు.. కష్టపడే వారిపైనే పెత్తనం చేసే సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు. ఈ తరహా మనుషులు ఎదుటి వ్యక్తుల పనిలో వంకలు వెతుకుతుంటారు.
రేయింబవళ్ల కష్టాన్ని సైతం చులకన చేసి మాట్లాడుతుంటారు. వెనుకటి రైతులు దేవుని కోసం ప్రత్యేకంగా ఓ మడిని ఉంచేవారు. ఇంటిల్లిపాదీ కూలోళ్లతో కలిసి పొలం కోయడానికి పోతే.. ఇంట్లోని పనిదొంగ మాత్రం పొద్దంతా ఊరు తిరిగొచ్చి సాయంకాలం పొలం కాడికి వెళ్లిండట. అప్పటికే పొలం కోత పూర్తవడంతో.. తనను ఎలాగైనా తిడతారని ముందే గ్రహించి.. ‘
అయ్యో.. దేవుని మడి ఎందుకు కోసిర్రే.. నేనెన్ని మొక్కులు మొక్కినా! ఎంత కావలిగాసినా!’ అంటూ వాళ్లపైనే గరంమైండట. దాంతో.. వాళ్లే లెంపలేసుకొని ‘ఏం కాదులే బిడ్డా’ అంటూ సముదాయించారట. అగో అట్లుంటది కొందరి తరీక!
Read Today's Latest Palukubadulu News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Marco Rubio | అమెరికాలోనూ నిత్యం నిరసనలు జరుగుతాయ్.. భారత్లో నిరసనలపై మార్కో రూబియో
woman kills twin sons | ప్రియుడు అంగీకరించలేదని.. కవల కుమారులను చంపిన మహిళ
కోట మైసమ్మ జాతరకు పోటెత్తిన భక్తజనం
బంగారు ఆభరణాల కోసం వృద్ధురాలి హత్య
MLC Botsa | ఏపీ పోలీసుల మీద నమ్మకం లేదు..కేంద్రబలగాలను రప్పించాలి : ఎమ్మెల్సీ బొత్స
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!

