ఆగమాగం అల్లుడు అత్త మెడల పుస్తె కట్టిండట
కొందరంతే! ముందూ వెనుకా చూడరు. మంచీ చెడూ ఆలోచించరు. తాము అనుకున్నదే నిజమని నమ్ముతారు. ప్రతీ విషయంలోనూ ఆగమాగం అవుతారు. ఇలా నిలకడ లేని ప్రవర్తన కలిగినవారిని ఉద్దేశించి చెప్పిన సామెతే ‘ఆగమాగం అల్లుడు అత్త మెడల పుస్తె కట్టిండట’.
కొందరంతే! ముందూ వెనుకా చూడరు. మంచీ చెడూ ఆలోచించరు. తాము అనుకున్నదే నిజమని నమ్ముతారు. ప్రతీ విషయంలోనూ ఆగమాగం అవుతారు. ఇలా నిలకడ లేని ప్రవర్తన కలిగినవారిని ఉద్దేశించి చెప్పిన సామెతే ‘ఆగమాగం అల్లుడు అత్త మెడల పుస్తె కట్టిండట’. ఇలాంటివారు అన్ని కాలాల్లోనూ మనకు తారసపడుతారు. బిత్తిరి వ్యవహారంతో ఆందోళనగా కనిపిస్తారు. ఇలాంటి ఓ వ్యక్తికి రాకరాక ఒక సంబంధం వచ్చిందట. అదికూడా ఎన్నో అవరోధాలు దాటుకొని పెండ్లివరకూ చేరుకుంది.
వేదికమీద పంతులుగారు ‘తాళికట్టు నాయనా’ అనగానే, ఎవరికి కట్టాలో అర్థంకాక పిల్ల పక్కనున్న అత్త మెడలో పుస్తె కట్టిండట. కొంతమంది పరిస్థితి ఇలానే ఉంటుంది. తమకు తెలియని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేయరు. పైగా, ఏదైనా అనుమానం, సమస్య వస్తే.. ఆగమాగం అవుతారు. బయటికి హుందాగా కనిపించినా.. తమ డొల్లతనాన్ని సులువుగా బయటపెట్టేస్తుంటారు.
Read Today's Latest Palukubadulu News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

