బకాయిల కోసం.. చలో సెక్రటేరియట్
రాష్ట్రవ్యాప్తంగా గల రిటైరైన దాదాపు 26 వేల మంది ప్రభుత్వ పెన్షనర్లు తమకు 2024 మార్చి నుంచి ఇప్పటివరకు రావాల్సిన బకాయిల కోసం నేడు చలో సెక్రటేరియట్ నిర్వహించనున్నారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ నిర్ణయం మేరకు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో సన్నాహక కార్యక్రమాలు చేపట్టింది.
రాష్ట్రవ్యాప్తంగా గల రిటైరైన దాదాపు 26 వేల మంది ప్రభుత్వ పెన్షనర్లు తమకు 2024 మార్చి నుంచి ఇప్పటివరకు రావాల్సిన బకాయిల కోసం నేడు చలో సెక్రటేరియట్ నిర్వహించనున్నారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ నిర్ణయం మేరకు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో సన్నాహక కార్యక్రమాలు చేపట్టింది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు సుమారు 105 మంది పెన్షనర్లు అనారోగ్యంతో, క్యాన్సర్ వంటి వివిధ రకాల జబ్బులతో బాధపడుతూ చనిపోయారు. రిటైరై రెండున్నరేండ్లయినా ప్రభుత్వం ఏ ఒక్కరికీ ఇప్పటివరకు పూర్తిస్థాయిలో బకాయిలను చెల్లించలేదు. ప్రజా పాలన, ఇందిరమ్మ రాజ్యం అని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ పాలనలో దుర్భర స్థితిలో పెన్షనర్లు కాలం గడుపుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు, పెన్షనర్ల నాలుగు ప్రధాన సమస్యలు, న్యాయంగా రావలసిన వాటిని కూడా అమలు చేయకుండా దాదాపు మూడేండ్లు అవుతున్నా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లను సర్కార్ వేధిస్తున్నది.రిటైర్మెంట్ బకాయిలు చెల్లించాలని బాధిత పెన్షనర్లు ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకుని వివిధ రకాల పోరాటాలు చేస్తున్న క్రమంలో వారికి మద్దతుగా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ తెలంగాణ (ఎస్జీపీఏటీ), పెన్షనర్ల జేఏసీ సంయుక్తంగా హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద, జిల్లా కేంద్రాల్లో గత ఏడాది నుంచి నాలుగుసార్లు మహాధర్నాలు చేపట్టాయి. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేదు. బాధిత సంఘాలు కూడా వివిధ జిల్లాలతోపాటు చలో అసెంబ్లీ, చలో రాజ్‌భవన్ కార్యక్రమాలు చేపట్టాయి. ఏప్రిల్, మే నెలల్లో 207 సంఘాలతో ఉన్న టీజీఈజేఏసీ ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది.
ఆ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు దాదాపు రూ.14 వేల కోట్లు పెండింగ్‌లో ఉంటే 100 రోజుల్లో ఆరు వేల కోట్లు చెల్లిస్తామని ఈ ఏడాది మే రెండున ఉద్యోగ జేఏసీకి సర్కార్ హామీ ఇచ్చింది. ఈ మేరకు మే నుంచి జూలై వరకు ప్రతినెలా రూ.2 వేల కోట్ల చొప్పున రూ.6 వేల కోట్లు చెల్లించామని ప్రభుత్వమే స్వయంగా వెల్లడించింది. 100% జీపీఎఫ్, 100% కమ్యూటేషన్ చెల్లించామని సర్కార్ వివిధ ప్రధాన పత్రికలు, టీవీ చానళ్లలో ప్రకటించుకున్నది. కానీ ఎంతోమందికి ఇంకా జీపీఎఫ్, కమ్యూటేషన్ కూడా రాలేదు. 2024లో రిటైరైన వారికి లీవ్ ఎన్ క్యాష్మెంట్, గ్రాట్యుటీ, జీఐఎస్ విడుదల కాలేదు. 2025లో రిటైరైన వారికి పీఆర్సీ ఎరియర్స్ కూడా చెల్లించలేదు.
ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగుల పట్ల ఏమాత్రం దయ, కనికరం, మానవత్వం చూపించకుండా, అమానవీయంగా ప్రవర్తిస్తున్నది. ఉద్యోగులు పొదుపు చేసుకున్న జీపీఎఫ్, జీఐఎస్, టీజీఎల్ఐ నిధులను కూడా ఇతర పథకాలకు పక్కదారి పట్టించింది. ప్రభుత్వం వద్ద డబ్బులు లేవంటూనే ఏ పథకాలనైనా నిధులు ఆపారా? అని రిటైర్డ్ ఉద్యోగులు నిలదీస్త్తున్నారు. రిటైరైన తర్వాత తర్వాత ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఎక్స్‌గ్రేషియా కూడా చెల్లించాల్సి ఉన్నా ప్రభుత్వం ముందుకు రావడం లేదు. దాదాపు మూడేండ్లుగా బకాయిలు అందక ఇబ్బందులు పడుతున్న రిటైర్డ్ ఉద్యోగులకు వడ్డీతో సహా ఏకమొత్తంగా చెల్లించాలని, కోర్టు ఆదేశాల మేరకు బకాయిలు సాధించుకున్న వారికి కూడా వడ్డీ చెల్లించాలి. పీఆర్సీ రిపోర్టును సంబంధిత కమిటీ చైర్మన్ ప్రభుత్వానికి వెంటనే సబ్మిట్ చేసి 51% ఫిట్మెంట్తో ఆమోదించడం, రెండు డీఏల ప్రకటన, నగదు రహిత వైద్యం పూర్తిస్థాయిలో సక్రమంగా అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో చెల్లుబాటు అయ్యేవిధంగా చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే కార్యక్రమాలను చేపట్టడానికి పెన్షనర్లు అందరూ సంసిద్ధంగా ఉండాలి. సంఘాలకు అతీతంగా వేలాదిగా పెన్షనర్లు పాల్గొని హక్కుల సాధన కోసం ఐకమత్యంగా ప్రభుత్వాన్ని నిలదీద్దాం.
(వ్యాసకర్త: తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్ల సంఘం నాయకుడు)
కందుకూరి దేవదాసు
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

