పరితపించిన పండుటాకులు
‘అమ్మా.. ఎమాయే ఇంకా వస్తలేరు, ఎంతసేపుంటరు?’ ‘జర ఆగయ్యా ఓటు వేయొద్దా? గుర్తు దొరకడంలేదు. ఓటు వేసొస్తా..!’
‘అమ్మా.. ఎమాయే ఇంకా వస్తలేరు, ఎంతసేపుంటరు?’ ‘జర ఆగయ్యా ఓటు వేయొద్దా? గుర్తు దొరకడంలేదు. ఓటు వేసొస్తా..!’
మొన్న జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల్లో కేసీఆర్ కారు గుర్తు కోసం పరితపించిన పండుటాకులను జీవితంలో మరువలేం. కేసీఆర్ మీద వారికున్న ప్రేమను చూస్తే జీవితంలో ఇంతకన్నా ఏ నాయకునికైనా ఇంకేం కావాలనిపిస్తుంది. చంద్రశేఖరున్ని గుండెల్లో నింపుకొన్న పండుటాకుల ప్రేమకు అందరూ ఫిదా కావాల్సిందే.
పార్లమెంటు ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పోటీ చేయడంతో పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు వారి సంఖ్యకు అనుగుణంగా రెండు మూడు ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థులకు సంబంధించిన క్రమ సంఖ్యను 3, 4వ నంబర్ దగ్గర కారు గుర్తును చూసి ఓటేయాలని ఆ పార్టీ కార్యకర్తలు ప్రచారం నిర్వహించారు. అయితే నమూనా ఈవీఎంతో ప్రచారం అనుకున్న స్థాయిలో చేయలేకపోవడంతో పోలింగ్ కేంద్రాల వద్ద పండుటాకులు ఆగమాగం కావడం కనిపించింది. 200 పింఛన్‌ను మొదాలు 1,016, తర్వాత 2,016, వికలాంగులకు 4,016 వరకు పెంచి కేసీఆర్ వారికి పెద్దదిక్కుగా నిలిచాడు. నిజానికి గతంలో 200 పింఛన్ వస్తే అవి వారి కనీస అవసరాలకు సరిపోయేవి కావు. ఇంట్లో కుటుంబీకులు వారిపై తగినంత శ్రద్ధ కూడా చేసేవారు కాదు.
కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక 200 పింఛన్‌తో ఏమొస్తయని 2000 చేశాడు. దీంతో పండుటాకులకు ఎంతో ధైర్యం వచ్చింది. చేతిలో ఖర్చులకు డబ్బులు నెలనెలా వస్తుండటంతో మనుమలు, మనుమరాండ్లకు కూడా నాలుగు రూపాయలు ఇచ్చేవారు. కొడుకు, కోడలు కూడా బాగా చూసుకోవడం కనిపించింది. మా జీవితానికి భరోసా ఇచ్చిన కేసీఆర్ కోసం శాసనసభ ఎన్నికల్లో కూడా ఎక్కువ శాతం ఓట్లేశారు. కొద్ది తేడాలో కేసీఆర్ ప్రభుత్వం రాకపోవడంతో వారు ఎంతో మధనపడ్డారు. అయ్యో.. మాకు నెల నెలకు పింఛన్ అందించి ఆధారం చూపిన పెద్ద కొడుకు కేసీఆర్ రాక పాయే అని వారు బాధపడుతూ మాట్లాడటం కనిపించింది.
ఈ క్రమంలో పార్లమెంటు ఎన్నికలు రావడంతో ఈసారైనా కేసీఆర్ రావాలని, కారు గుర్తుకు ఓటెయ్యాలని వారు బలంగా అనుకున్నారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లేసరికి రెండు, మూడు ఈవీఎంలు ఉండటంతో కొంతమంది ఆగమయ్యారు. కారు గుర్తు ఎక్కడ? అని ఈవీఎంలలో వెతికారు. దీంతో ఓటు వేయడం ఆలస్యం కావడంతో సిబ్బంది ‘ఎంత సేపు’ అని అనడం, ‘గుర్తు కనపడటం లేదు, వేసి వస్తాం’ అని వారు జవాబివ్వడం లాంటి సంఘటనలు అన్ని పోలింగ్ స్టేషన్లలో చోటుచేసుకున్నాయి. ఈవీఎంలలో ఎక్కువ గుర్తులు ఉండటంతో కొంత ఆందోళనకు గురయ్యారు. నాడు కేసీఆర్ ముఖ్యమంత్రి కాలేకపోయాడు, ఇప్పుడైనా(కారు) కేసీఆర్ గెలవాలని, మా ఓటు బరాబర్ కారుకే వేయాలని వారు ఈవీఎంలలో వెతికి మరీ ఓటు వేశారు. కంటిచూపు తక్కువున్నవారు మాత్రం చాలా ఇబ్బందిపడ్డారు. తిన్న దగ్గర రేవు తలవాలన్నట్టు వారు చూపించిన శ్రద్ధను మరువలేం. అలాగే పండుటాకులతో పాటు రైతు బిడ్డలు కూడా ఎక్కువ శాతం కేసీఆర్‌కే మొగ్గు చూపడం కనిపించింది.
రాదనుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని తెలంగాణ ప్రజలను ఒక్కటి చేసి సాధించిన కేసీఆర్ పదేండ్లలో తెలంగాణను బంగారు తునుక చేశారు. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమాన్ని, కేసీఆర్‌కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక జిత్తుల మారి కాంగ్రెస్, బీజేపీలు ఒక్కటై విష ప్రచారం చేశాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలువకుండా అడ్డుకున్నాయి. 6 గ్యారంటీలతో సహా 420 హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం బొక్క బోర్లా పడటంతో వారి అసలు రంగు బయటపడింది. జరిగిన పొరపాటును ప్రజలు గుర్తించారు. ప్రభుత్వం రాకపోయినా ప్రజల గుండెల్లో కేసీఆర్ మాత్రం చెరగని ముద్ర వేసుకున్నారు. ఎక్కడికి వెళ్లినా, ఎక్కడ చూసినా కేసీఆర్ పథకాలే, ఆయన చేసిన అభివృద్ధే కనిపిస్తున్నది. కేసీఆర్ బస్సు యాత్రలకు జన నీరాజనం పట్టారు.
నాడు దొరల పాలన, గడీల పాలన, మద్యం ఏరులై పారుతుందంటూ ఊదరగొట్టిన యూట్యూబ్ చానళ్లు జరిగిన పొరపాటును గుర్తించి కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతున్నాయి. ఉన్నప్పుడు తెలియదు మంచోని విలువ.. కోల్పోయినప్పుడే తెలుస్తుందన్నట్టు నేడు తెలంగాణ అంతటా కారు రావాలని, కేసీఆర్ కావాలని కోరుకుంటున్నారు.
జీడిపల్లి రాంరెడ్డి
96666 80051
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
Bathukamma Celebrations | సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ – 2026 వేడుకలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

