నింగితల్లి కొంగునుంచి జారిపడిన బంగారం ఈ వాన..
వానకుఎన్ని రంగులో, ఎన్ని హంగులో అంతా వాననే కానీ, వానంతా ఒకటి కాదు..
చెట్టుమీద పచ్చదనాన్ని పొదిగి వాన పక్షి ఐతది..
చెరువు మీద నీళ్ల బలం పెంచి చేప ఐతది..
మడుగులోన బుడుక్కున మునిగి కప్ప ఐతది..
చేన్ల మీద వాలి చిలుకైతది..
వానకొలనును పలుకరిస్తూ కొంగైతది..
పల్లెను ముట్టడించి పంటైతది..
పట్నాన్ని తడిపి ఘుమఘుమల వంటైతది..
వాన, మనిషి తడువకుండా గొడుగైతది..
తడిస్తే తువ్వాలైతది..
ఉదయం పూట చాయైతది..
మధ్యాహ్నం వేడి వేడి అన్నమైతది..
వాన సాయంత్రం గరం మిర్చీ ఐతది..
రాత్రిని మన నిద్రల మీద వెచ్చగా కప్పి బయట పహారా కాస్తది!!
వాన బహురూపం వాన మన మనసుకు ప్రతిరూపం!
డాక్టర్ కాసర్ల నరేశ్ రావు
94414 06252