అయ్యో తల్లీ..
2024, మే 11 శనివారం రాత్రి ఏడు గొడ్తున్నది. జూబ్లీ బస్టాండ్ల ఉస్కెవోత్తే రాలనంత జనం. కరీంనగర్‌కు వొయ్యే సూపర్ లగ్జరీ బస్సు ప్లాట్‌ఫాంపై ఒక్కటేమొకాన వణుకుతా ఉన్నది. అర్రె బస్సెల్లిపోగల్లా... అని ఉరికుర్కి ఎక్కిన. అదృట్టం మంచిగుండి సీటు గూడ దొర్కింది.
2024, మే 11 శనివారం రాత్రి ఏడు గొడ్తున్నది. జూబ్లీ బస్టాండ్ల ఉస్కెవోత్తే రాలనంత జనం. కరీంనగర్‌కు వొయ్యే సూపర్ లగ్జరీ బస్సు ప్లాట్‌ఫాంపై ఒక్కటేమొకాన వణుకుతా ఉన్నది. అర్రె బస్సెల్లిపోగల్లా… అని ఉరికుర్కి ఎక్కిన. అదృట్టం మంచిగుండి సీటు గూడ దొర్కింది.
బస్సుల గూసున్ననో లేదో… నా ఎన్కనే బస్సెక్కిందో తల్లి. సంకలో బిడ్డను, కుడిచెయ్యిల ఇంకో బిడ్డను వట్టుకొని ఆత్రంగా అచ్చి నా పక్క సీట్లనే గూసున్నది. బస్సు నిండింది. స్టీరింగ్ సీట్లకెళ్లి లేసి ‘టిక్కెట్ టిక్కెట్’ అనుకుంటా సక్కగా నా దగ్గర్కే అచ్చిండు డ్రైవర్ సాబ్. ముందుగాళ్ల నాకు టిక్కెటిచ్చి, ఆ తర్వాత ఆ సంటిపిల్లల తల్లిని గూడ టిక్కెటడిగిండు.
గుక్కవట్టి ఏడుస్తనే ఉన్నరు ఇద్దరు సంటి పిలగాండ్లు. ‘ఆ సమ్మోసే.. ఆ గరం గరం సమ్మోసే…’ అనుకుంటా బస్సెక్కిండు సమోసాలమ్ముకునే పిలగాడు. ఆయన మాటలినవడంగనే ఏడుపాపి బీరిపొయి సూత్తున్నరు పిల్లలు. ఆ తల్లి శెయ్యిసంచిల ఏదో ఎన్కులాడుతున్నది. డ్రైవర్ టిక్కెటడిగిండు కావట్టి పైసలే ఎన్కులాడుతుందనుకున్న. కానీ ఆమె ఎన్కులాడుతున్నది పైసల్ గాదు, ఆధార్ కారట అని ఆల్షంగా అర్థమైంది.
‘టిక్కెట్‌కు పైసలడిగితే అవియ్యకుండా.. ఆధార్ కారటిస్తున్నవేందమ్మా..?’ అని అడుగవట్టిండు డ్రైవర్ సాబ్. ‘పైసలా, అయ్యో సార్ ఇది ఆధార్కారట సూపెడితే ఫిరీగా తోల్కవొయ్యే బస్సు గాదా?’ అని అమాయకంగా అడుగవట్టింది ఆ తల్లి. ‘నువ్ అస్సులున్నవమ్మా.. ఇది ఫ్రీ బస్సెందుకైతది? ముందుగాళ్లనైతే మూడు వందలియి, లేకుంటే ఈ బస్సు దిగి, వేరే బస్సు ఎక్కుపో’ అని డ్రైవర్ గద్రాయించవట్టిండు. ఆ బస్సుల ఆమెతోపాటు ముగ్గురే ఆడోళ్లున్నరు. బస్సు సీట్లన్ని నిండిపోయి ఉన్నయి.
‘ఈ బస్సుల ఆధార్కారట శెల్లదా సార్?’ అని మళ్లోపారి అడుగవట్టింది. ‘ఇది ఫ్రీ బస్సు గాదని శెప్తే ఇనవడ్తలేదా అమ్మ నీకు?’ అని ఈసారి ఇసుగ్గా అన్నడు డ్రైవర్. ఉడ్కవోతకు అందరంగీలు నానినయి. బస్సు బైలెల్లితే సల్లటి గాలొస్తదనే ఆశతోని సూస్తున్నరు బస్సులున్న జనాలు. ‘డ్రైవర్ సాబ్ బస్సియ్యాళ్ల వోతదా, లేదా’ అని ఒగలడిగితే… ‘సూత్తే సద్వుకున్నదాని లెక్క గొడ్తున్నవ్? ఏది ఫ్రీ బస్సో, ఏది ఫ్రీ బస్సు గాదో గాయింత తెల్వదానమ్మా నీకు?’ అని ఇంకొగలడుగుతున్నరు.
ఎహ్హె ఇదంతా గాదని శెయ్యిసంచిల పైసల్ ఎన్కులాడుడు షురూజేసింది. ఓ వంద రూపాల నోటు, ఓ యాభై రూపాల నోటు.. ఓ పది రూపాల నోటు, రెండు, మూడు ఇరువై రూపాల నోట్లు మొత్తం ఆరేడు నోట్లు ఎల్లినట్టున్నయి గని, అవి మొత్తం మూడు వందల రూపాలు మాత్రం గాలె. ‘అయినా.. ఈ ఫ్రీ బస్సు వెట్టినోనికి బుద్ధిలేద్ గని’ అని ఒగలంటే, ‘ఆయ్నను దీస్కచ్చి ఈ ఉడ్కవోతల కూసోవెట్టాలె’ అని ఇంకొగలంటున్నరు. తలా ఓ మాట అంటా ఉంటే పాపం ఆ తల్లి మస్తు ఇబ్బందులు వడ్డది. ‘ఫిరీ బస్సనుకొని ఎక్కిన, కొద్దిగ సైసుర్రి దిగిపోతా..’ అని బస్సులున్న జనాలను బతిలాడుతున్నట్టు చూసింది.
‘ఆ సమ్మోసే.. ఆ గరం గరం సమ్మోసే…’ అని సమోసా పిలగాని మాటలు శిన్నగైతున్నయి. బస్సు దిగిపోతున్న ఆ పిల్లగాన్ని సూసుకుంటా ఇద్దరు సంటిపిలగాండ్లు మళ్లా ఏడ్పందుకున్నరు. ఏడుస్తున్న ఆ పిల్లల్ని దీస్కొని పాపం ఆ తల్లి బస్సు దిగింది. ఆమెను చూసి కొందరు నవ్వుతా ఉంటే, ఇంకొందరేమో ‘అయ్యో పాపం తల్లీ…’ అని జాలివడ్తనే ఉన్నరు.
గడ్డం సతీష్
99590 59041
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

