నా తెలంగాణ
ఆకురాలు కాలంలోనూ ఎండిన తరువుల నడుమ పసుప్పచ్చ తంగేడై విలసిళ్లిన పరిమళం
ఆకురాలు కాలంలోనూ ఎండిన తరువుల నడుమ
పసుప్పచ్చ తంగేడై విలసిళ్లిన పరిమళం
నా తెలంగాణ..
మేడారం జాతరలో వనదేవతలావహించి
కురులిప్పి శిగమూగే తల్లి పరవశం
నా తెలంగాణ..
అసైదులా దరువుకు అలావా చుట్టూ
కూడి, ఆడి, పాడి మైమరిచే పిల్లగాండ్ల తన్మయత్వం
నా తెలంగాణ..
షడ్రుచుల మేళవింపును,
షీర్ ఖుర్మా, షర్బత్‌లను,పరస్పరం పంచుకునే ప్రేమతత్వం
నా తెలంగాణ..
సోపతోడు మల్లేశం,ఇఫ్తార్ విందులో ఇఫ్తికార్ పెదాలకద్దిన
ఖర్జూరపు కమ్మదనం నా తెలంగాణ..
నెమలీకల కట్టతో,
నెత్తిని నిమిరి, వీపుపై చరిచి,
రందివడ్డ మనసులకు తాయత్తు కడుతూ,
ఊరి ఆత్మకు దాదాజాన్ అంటించిన,
ధైర్యవచనం నా తెలంగాణ..
ఎవరో విడగొడితే విడిపోయేంత,
నాజూకు బంధం కాదిది..
తగవుబెడితే తగలబడేంత,
కంజోర్ దిల్ కాదు మాది..
యుగాలుగా ఈ మట్టిలోనే నాటుకొని,
తీగలుగా పారి మనసుల్ని అల్లుకొని,
మమకారాలను వెదజల్లుతున్న
నందివర్దనం పువ్వు నా తెలంగాణ..
జాబేర్ పాషా
(మస్కట్, ఒమన్)
00968 78531638
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఇల్లెందు తాగునీటి సమస్యను పరిష్కరించాలి’
Gadapa Song | ‘ఇడుపు కాయితం’ నుంచి సెకండ్ సింగిల్ ‘గడప’ పాట విడుదల
Abhijeet Dipke | ఢిల్లీని కాదు.. చైనాతో సరిహద్దుల్ని కాపాడండి.. మోదీపై అభిజీత్ దీప్కే విమర్శలు
418 Movie | ‘418’ మూవీ రివ్యూ.. ప్రశాంత్ నీల్ హారర్ సినిమా భయపెట్టిందా?
Bomb Threat Mail: అమితాబచ్చన్ ఇళ్లు, ముంబై మేయర్ ఆఫీసుపై దాడి చేస్తాం: బెదిరింపు మెయిల్
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

