దివ్యాంగులకు మొండిచెయ్యి
సమాజంలో దివ్యాంగులు, వృద్ధులు నిత్యం వివక్ష ఎదుర్కొంటున్నారు. వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నది. కానీ, కాంగ్రెస్ సర్కార్ ఆ బాధ్యతను విస్మరిస్తున్నది.
ఏ ప్రభుత్వమైనా సరే పేదల అభ్యున్నతి కోసం, వారు గౌరవంగా జీవించటానికి, వారి జీవన ప్రమాణాలను పెంచటానికి కృషి చేస్తుంది. అందుకనుగుణంగా పథకాలను రూపొందిస్తుంది. ప్రాధాన్య క్రమంలో అమలు చేస్తుంది. కానీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ తీరు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నది. పథకాల పేరిట ప్రజలను ఆకర్షించి, ఓట్లు దండుకున్నది. ఇప్పుడు ఉన్నవారికే పథకాలను వర్తింపజేస్తూ.. పేదలు, సమాజంలో వివక్షను ఎదుర్కొంటున్న, నిస్సహాయులైన వృద్ధులు, దివ్యాంగులను విస్మరిస్తున్నది.
సమాజంలో దివ్యాంగులు, వృద్ధులు నిత్యం వివక్ష ఎదుర్కొంటున్నారు. వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నది. కానీ, కాంగ్రెస్ సర్కార్ ఆ బాధ్యతను విస్మరిస్తున్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలైనా ఎన్నికల మ్యానిఫెస్టోలో దివ్యాంగులకు, వృద్ధులకు ఇచ్చిన పింఛన్ పెంపు హామీని నెరవేర్చలేదు. అధికారంలోకి రాగానే ఫ్రీ బస్సు హామీని అమలు చేసిన రేవంత్ సర్కార్.. ఇప్పుడు తాజాగా రైతు రుణమాఫీపై దృష్టిసారించింది. మానవీయ కోణంలో వాటి కంటే ముందే అమలు చేయాల్సిన పింఛన్ పెంపును మాత్రం ఇప్పటికీ పట్టించుకోవడం లేదు.
తాము అధికారంలోకి వస్తే వెంటనే సాధారణ పింఛన్‌ను రూ.4 వేలకు, దివ్యాంగుల పింఛన్‌ను రూ.6 వేలకు పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అంతేకాదు, దివ్యాంగులకు బస్సుల్లో ఉచిత ప్రయాణం, బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేస్తామని వాగ్దానం చేసి ఓట్లు వేయించుకొని ఇప్పుడు మాట తప్పింది.
ఇటీవల ప్రతి గ్రామంలో మీ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని, అవి మహిళలకు కేటాయిస్తామని, అందుకోసం వారికి 2.50 లక్షల వరకు రుణాలు మంజూరు చేస్తామని రేవంత్ ప్రభుత్వం ప్రకటించింది. ఇలాంటి స్వయం ఉపాధి పథకాలను కూడా సకలాంగులకే కేటాయిస్తే, దివ్యాంగులు బతికేదెట్టా?
కేసీఆర్ సర్కార్‌పై దుష్ప్రచారం చేసి వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులను మాయమాటలతో మోసం చేసి ఓట్లు వేయించుకున్న రేవంత్ ఇప్పుడు వారిని పట్టించుకోవడం లేదు. నూతన పింఛన్ల కోసం తీసుకున్న దరఖాస్తులూ అటకెక్కాయి.
2014లో కొత్తగా ఏర్పడిన తెలంగాణలో అప్పటి సీఎం కేసీఆర్ ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. అయినా అధికారంలోకి వచ్చిన ఒక్క నెలలోనే వృద్ధులకు రూ.వెయ్యి, దివ్యాంగులకు రూ.1500 పింఛన్‌ను అందజేసిన మహనీయుడు కేసీఆర్. రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే, ఇచ్చిన మాటకు కట్టుబడి వృద్ధులకు రూ.2,016, దివ్యాంగులకు రూ.3016 పింఛన్‌ను అందించారు. దివ్యాంగుల అవసరాలను గ్రహించి, మానవీయ కోణంలో ఆలోచించి పింఛన్‌ను రూ.4016కు పెంచిన ఆత్మబంధువు కేసీఆర్.
పింఛన్ల మీదే ఆధారపడి జీవిస్తున్న నిస్సహాయులైన వృద్ధులు, దివ్యాంగుల పొట్టకొట్టి, వారి నోటి కాడి బువ్వను రుణమాఫీ పేరిట భూములు ఉన్నోళ్లకు రేవంత్ పంచుతున్నారు. దివ్యాంగులు, వృద్ధులు అడగలేరు, ప్రశ్నించలేరనే ఉద్దేశంతోనే రేవంత్ సర్కార్ ఈ విధంగా వ్యవహరిస్తున్నది. నిస్సహాయులైన వృద్ధులు, దివ్యాంగులు రోడ్డెక్కి నిరసనలు తెలిపే పరిస్థితి రావడం రేవంత్ సర్కార్‌కు సిగ్గుచేటు.
-దుర్గం కన్న
62816 24720
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress | అసలు కాంగ్రెస్ కాదిది కబ్జా కాంగ్రెస్.. సచివాలయంలో ఓ మంత్రి సంచలన వ్యాఖ్యలు!
Khajaguda Land Scam | భూదాహం.. సర్కార్ దాసోహం.. రూ.680 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని మింగిన కంత్రీ కంపెనీ
Horoscope | 05-11-2026 గురువారం.. మీ రాశి ఫలాలు
సారే రావాలంటూ సైకిల్ యాత్ర!
ఆత్మగౌరవం లేని ఢిల్లీ పార్టీలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

