chilling video: ఎలుగుబంటి వద్దకు కుమార్తెను విసిరేసిన మహిళ.. తర్వాత ఏమైందంటే?

తాష్కెంట్: ఒక మహిళ తన మూడేండ్ల కుమార్తెను జూలోని ఎలుగుబంటి ఉన్న ఎన్‌క్లోజర్‌లోకి విసిరేసింది. ఒళ్లు జలదరింపజేసే ఈ ఘటన ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్లో జరిగింది. 30 ఏండ్ల మహిళ వింతగా ప్రవర్తించింది. జూలో ఎలుగుబంటి ఉన్న చోట ఆమె నిల్చున్నది. ఉన్నట్టుండి మూడేండ్ల పాపను రైలింగ్ నుంచి సుమారు 16 అడుగుల దిగువన ఉన్న కందకంలోకి విసిరేసింది. అక్కడున్న మిగతా సందర్శకులు ఆమెను నిలువరించేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది.
కాగా, ఎన్‌క్లోజర్‌లోని కందకంలో పడిన పాప వద్దకు జుజు అనే గోధుమ రంగు ఎలుగుబంటి వచ్చి వాసన చూసింది. ఇంతలో సందర్శకులు ఈ ఘటనపై జూ సిబ్బందిని అప్రమత్తం చేశారు. దీంతో వారు వెంటనే ఆ ఎలుగుబంటిని ఎన్‌క్లోజర్‌లోకి పంపి పాపను రక్షించి బయటకు తెచ్చారు. దీంతో ఆ పాపకు ఆ ఎలుగుబంటి వల్ల ముప్పు తప్పింది. అయితే 16 అడుగుల ఎత్తు నుంచి ఆమె తల్లి విసిరేయడంతో ఆ చిన్నారికి గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు పాపను ఎలుగుబంటి ఉన్న చోటకు విసిరేసిన తల్లిని అరెస్ట్ చేశారు. ఆమెపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ నేరం నిరూపణ అయితే 15 ఏండ్ల జైలు శిక్ష పడే అవకాశమున్నది.
కాగా, 30 ఏండ్ల ఆ మహిళ భర్త పేదరికం వల్ల పని కోసం రష్యా వెళ్లాడు. యూనివర్సిటీలో లెక్చరర్‌గా పని చేస్తున్న ఆమె తన ఇద్దరి పిల్లలు, తండ్రితో కలిసి నివసిస్తున్నది. కొంతకాలంగా డిప్రెషన్‌తో బాధపడుతున్న ఆ మహిళ ఈ విధంగా పాపను ఎలుగుబంటి ఉన్న చోటకు విసిరేసినట్లు తెలుస్తున్నది.
మరోవైపు జూలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
VIEWER DISCRETION IS ADVISED!
— Press TV 🔻 (@PressTV) February 1, 2022
CCTV footage shows a woman throwing her daughter into a bear's enclosure in Uzbekistan's Tashkent Zoo.
The toddler was not harmed by the bear, but she was hospitalized with injuries due to the fall.
The woman’s motivation has remained unclear. pic.twitter.com/R5c4aDzSFA
Read Today's Latest Nt-special News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

