20 కోట్ల విలువైన డైమండ్ రింగ్ చెత్త బుట్టలో వేయబోయింది.. కానీ

లండన్ : తాను చెత్తబుట్టలో పడవేద్దామనుకున్న ఉంగరం రూ 20 కోట్ల విలువైన 34 క్యారెట్ల డైమండ్ రింగ్ అని గుర్తించిన ఓ బ్రిటన్ మహిళ కంగుతింది. కొన్నేండ్ల కిందట ఈ రింగ్‌ను కొనుగోలు చేసిన మహిళ (70)కు అప్పట్లో దీని విలువ గురించి అవగాహన లేదు. కాస్ట్యూమ్ జ్యూవెలరీతో కలిసిఉన్న ఈ రింగ్‌ను చెత్తబుట్టలో పడేయాలని మహిళ అనుకోగా పొరుగింటి వ్యక్తి సూచనతో దీని విలువను కనుగొనాలని నిర్ణయించుకుంది. ఇతర సాధారణ జ్యూవెలరీతో కలిపి ఓ బాక్స్‌లో ఈ ఉంగరాన్ని మహిళ తీసుకువచ్చారని నార్త్ షీల్డ్స్‌లోని పిటోంబీ ఆక్షనీర్స్కు చెందిన మార్క్ లేన్ వివరించారు.
పౌండ్ కాయిన్ కంటే పెద్దదైన భారీ స్టోన్ ఈ రింగ్‌లో ఉందని ఇది సీజడ్ అనుకున్నానని, డైమండ్ టెస్టర్ మెషీన్‌తో పరీక్షించేవరకూ మూడు రోజుల పాటు ఈ రింగ్ తన టేబుల్‌పై ఉందని ఆయన చెప్పుకొచ్చారు. బెల్జియంకు చెందిన నిపుణులు ఇది 34 క్యారెట్ డైమండ్ అని తెలపడంతో దాన్ని లండన్‌లోని తమ భాగస్వాములకు పంపామని తెలిపారు. ఈ ఆభరణాన్ని మహిళ ఎప్పుడు, ఎక్కడ కొన్నారో స్పష్టంగా చెప్పలేకపోయారని అన్నారు. అత్యంత ఖరీదైన, విలువ కలిగిన ఈ రింగ్‌ను నవంబర్ 30న వేలం వేస్తామని తెలిపారు. అప్పటివరకూ దీన్ని లండన్ డైమండ్ క్వార్టర్ హాటన్ గార్డెన్స్‌లో అత్యంత భద్రత నడుమ ఉంచుతామని చెప్పారు.
Read Today's Latest Nt-special News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

