రూ. 14 లక్షలు పలికిన అరుదైన మొక్క.. ఏంటి దీని స్పెషల్?

ఓ అరుదైన ఇండోర్ మొక్క ఎవరూ ఊహించని ధరకు వేలంలో అమ్ముడుపోవడం హాట్ టాపిక్ గా మారింది. న్యూజిలాండ్ ఆక్షన్ వెబ్ సైట్ ట్రేడ్ మి వేదికగా కేవలం ఎనిమిది ఆకులు కలిగిన ఈ అరుదైన మొక్కను అక్లాండ్ కు చెందిన వ్యక్తి ఏకంగా రూ 14 లక్షలకు సొంతం చేసుకున్నాడు. తెలుపు రంగులో ఉండే రాపిడోఫోరా టెట్రాస్పెర్మా అనే ఈ మొక్క ప్రతి ఆకులో కాండం వలే అద్భుతమైన వైవిధ్యత ఉందని ట్రేడ్ మి తెలిపింది.
రాయల్ గార్డెన్స్ కు చెందిన ఆన్లైన్ ప్లాంట్ రిజిస్టర్ క్యూలో నమోదైన వివరాల ప్రకారం ఈ మొక్క థాయ్‌లాండ్ ,మలేషియాలకు చెందినదని వెల్లడైంది. ఇండ్లలో పెంచుకునే మొక్కల్లో అత్యధిక ధర పలికిన అరుదైన మొక్క ఇదేనని ఈ మొక్క ఫోటోను ట్రేడ్ మి ట్వీట్ చేసింది. ఈ మొక్క వేలం ప్రక్రియ సాగుతుండగా అరుదైన మొక్కకు లక్షకు పైగా వ్యూస్ రావడం మొక్కల పట్ల న్యూజిలాండ్ వాసులకు ఎంతటి ప్రేమ ఉందనేది వెల్లడవుతోందని ట్రేడ్ మి ప్రతినిధి మిల్లీ సిల్వెస్టర్ పేర్కొన్నాడు. గత ఏడాదిలోనూ న్యూజిలాండ్ లో కేవలం ఆరు ఆకులు కలిగిన ఇండోర్ ప్లాంట్ ఏకంగా వేలంలో రూ 3,91,000 పలికింది.
Read Today's Latest Nt-special News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

