యజమాని ప్రాణాన్ని కాపాడిన పెంపుడు కుక్క

న్యూయార్క్ : యజమాని పట్ల విశ్వాసం చూపడంలో శునకానికి మించినది లేదు. అమెరికాలోని కన్సాస్ సిటీ లో తన యజమాని ప్రాణాలను కాపాడిన పెంపుడు కుక్క ఉదంతం సో|షల్ మీడియాలో వైరల్ గా మారింది. తన యజమాని ప్రాణాపాయ పరిస్థితిపై పొరుగు వ్యక్తిని సకాలంలో కుక్క ఎలా అలర్ట్ చేసిందనే వివరాలను కన్సాస్ సిటీ పోలీస్ డిపార్ట్ మెంట్ ఫేస్బుక్ పోస్ట్ లో వెల్లడించింది. ఆదివారం రాత్రి లౌరెల్ ప్రాంతంలో ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కతో కలిసి వాకింగ్ చేస్తుండగా తీవ్ర అస్వస్ధతకు లోనయ్యాడు.
దీంతో యజమాని ప్రాణాపాయాన్ని పసిగట్టిన కుక్క వెంటనే పొరుగున ఉండే వ్యక్తిని అప్రమత్తం చేయగా వారు 911కు కాల్ చేశారని పోలీసులు పేర్కొన్నారు. కుక్క సమయస్ఫూర్తితో వ్యక్తికి సకాలంలో వైద్యం అంది కోలుకున్నారని వెల్లడించారు. ఈ పోస్ట్ ఆన్ లైన్ లో పోస్ట్ కాగానే పెద్దసంఖ్యలో లైక్స్ రావడంతో పాటు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పెంపుడు కుక్క యజమాని త్వరగా కోలుకోవాలని పలువురు నెటిజన్లు ఆకాంక్షించారు. యజమాని పట్ల కుక్క చూపిన విశ్వాసం, ఔదార్యాన్ని కొనియాడారు.
Read Today's Latest Nt-special News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

