పర్సులో రూ 290 కోట్ల జాక్‌పాట్ కొట్టిన లాటరీ టికెట్ ఉన్నా పట్టించుకోలేదు!

పారిస్ : అదృష్టం తలుపుతట్టినా దురదృష్టం వెంటాడితే వారిని ఎవరూ బాగుచేయలేరు. కాలిఫోర్నియాకు చెందిన ఓ మహిళ రూ 190 కోట్ల లాటరీని గెలుపొందినా డ్రాకు ముందే వాషింగ్ మెషీన్లో టికెట్ పాడైపోవడంతో కోరివచ్చిన సంపదను చేజేతులా కాలదన్నుకుంది. ఇక తాజాగా జర్మన్ మహిళ ఏకంగా రూ 290 కోట్ల జాక్‌పాట్ తగిలిన లాటరీ టికెట్‌ను పర్సులోనే పెట్టుకుని వారాల తరబడి ఆ ఊసే మరిచిపోయింది.
జూన్ 9న లొట్టో 6ఆస్-49 డ్రాలో లోయర్ ఫ్రాంకోనియా (45) కొనుగోలు చేసిన టికెట్‌ను పర్సులోనే దాచగా అదే టికెట్ లాటరీలో బంపర్ ప్రైజ్ లభించింది. ఆ విషయం తెలియని ఫ్రాంకోనియా ఆరు వారాల తర్వాత మరో లాటరీ టికెట్ కొనుగోలు చేసే క్రమంలో గతంలో తాను కొన్న లాటరీ టికెట్ విషయం గుర్తుకువచ్చింది. డ్రాలో తన పర్సులో దాచిన టికెట్‌కే జాక్‌పాట్ తగిలిందని తెలుసుకుని ఆశ్చర్యానికి లోనైంది.
వారం పాటు ఆమె మిలియనీర్‌గా చెలామణిలో ఉన్నా ఆ విషయం ఫ్రాంకోనియాకు తెలియలేదు. నెల రోజుల కిందటి టికెట్‌ను ఆమె లాటరీ అధికారులకు అందించి భారీ ప్రైజ్‌ను సొంతం చేసుకుంది. 75 ఏండ్ల లొట్టో బేయర్న్ చరిత్రలో ఇది రెండవ అతిపెద్ద మొత్తం కావడం గమనార్హం.
Read Today's Latest Nt-special News in Telugu and Telugu News
- Tags
- Germany
- Lottery Jackpot
- women
RELATED ARTICLES
తాజా వార్తలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

