న్యూఢిల్లీ : జంతువుల విన్యాసాలతో కూడిన వీడియోలు ఇంటర్నెట్ ను ముంచెత్తుతూ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఇదే తరహాలో ఓ రోడ్డు పక్కన షాపులో వానరం కూరగాయలు అమ్ముతూ కనిపించిన 24 సెకండ్ల వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
కోతి చుట్టూ పలు రకాల కూరగాయలు ఉండగా వాటిని అమ్ముతున్నట్టు కోతి ఫోజులు పెడుతూ పలువురిని ఆకట్టుకుంటోంది. కోతి పక్కన బరువు తూచే యంత్రం కూడా ఉండగా కెమెరా జూమ్ కాగానే కోతి అటూ ఇటూ చూస్తుండటం కనిపించింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు వానరం ఫోజులు చూసి వావ్ అంటున్నారు.