RAPO 23 | ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన కెరీర్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించబోతున్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తూ, తొలిసారి దర్శకుడిగా మెగాఫోన్ పడుతున్న ప్రతిష్టాత్మక చిత్రం #RAPO23. ఈ ప్రాజెక్ట్ రేపు (జూన్ 29)న గ్రాండ్ పూజా కార్యక్రమంతో అధికారికంగా ప్రారంభం కానుంది. “ది స్టోరీ ఆఫ్ ఎ లోన్ ఉల్ఫ్” అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ స్టైలిష్ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌లో రామ్ ‘వీర’ అనే ఎంతో పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు.
రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై నిర్మాత కృష్ణ పోతినేని దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్‌తో రామ్ కెరీర్లోనే అత్యంత వ్యయభరితంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత తిరు సినిమాటోగ్రాఫర్‌గా, మలయాళ సెన్సేషన్ సామ్ సీఎస్ సంగీత దర్శకుడిగా, మరియు ప్రముఖ ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్ యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకోగా, రేపటి ముహూర్తం అనంతరం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుని, ఇదే ఏడాది డిసెంబర్ 2026లో ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది.
The Lone Wolf awakens. 🐺🔥#RAPO23 is all set to begin its Epic journey with a Grand Pooja Ceremony Tomorrow, 29th June 🖤 ✨
Starring Energetic Star @ramsayz ❤️🔥
Written & Directed by #𝙍𝘼𝙋𝙊
Produced by Krishna Pothineni
A @RAPO_Cinematics production.@DOP_Tirru pic.twitter.com/JbCHS0IjEK— RAPO Cinematics (@RAPO_Cinematics) June 28, 2026