స్కర్ట్స్ తో క్లాసులకు వచ్చిన మగ టీచర్లు

మ్యాడ్రిడ్ : గత ఏడాది స్కర్ట్ తో వచ్చాడని ఓ బాలుడిని స్కూల్ నుంచి బహిష్కరించిన ఘటన నేపథ్యంలో మూస ధోరణితో కూడిన లింగ నిబంధనలకు వ్యతిరేకంగా స్పెయిన్ అంతటా మగ టీచర్లు వినూత్న ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. నిరసన రూపంలో దేశ వ్యాప్తంగా మగ టీచర్లు స్కర్ట్స్ ధరించి క్లాసులకు హాజరవుతున్నారు. 2020 నుంచి స్పెయిన్ లో దుస్తులకు జెండర్ ఉండదనే ఉద్యమం ఊపందుకుందని మెట్రో.కో.యూకే వెబ్ సైట్ పేర్కంది. ఈ వినూత్న ఉద్యమంలో భాగంగా ఇటీవల ఇద్దరు పురుష టీచర్లు ట్రౌజర్లను పక్కనపెట్టి స్టైలిష్ స్కర్ట్స్ తో క్లాస్ లకు రావడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మే నెల ఆరంభం నుంచి వీరిద్దరూ స్కర్ట్స్ తో స్కూల్ కు వస్తున్నారు. జెండర్ నిబంధనలకు నిరసనగా ఓర్పును ప్రమోట్ చేసేందుకే తాము ఇలా చేస్తున్నామని పురుష టీచర్లు మానుల్ ఒటెగా, బొజ వెలజ్ క్వెజ్ చెబుతున్నారు. తాము స్కర్ట్స్ ధరించాలనే నిర్ణయం సోషల్ మీడియాను ఆకర్షించాలనే ఉద్దేశంతో తీసుకోలేదని, జెండర్ ధోరణులకు వ్యతిరేకంగానే ఇలా చేస్తున్నామని వారు ఓ స్పానిష్ పత్రికతో చెప్పుకొచ్చారు. ఇక బిల్బావోలోని ఓ స్కూల్ లో మైఖేల్ గొమెజ్ అనే విద్యార్ధి స్కర్ట్ ధరించి క్లాసుకు రావడంతో స్కూల్ నుంచి అతడిని బహిష్కరించిన మీదట 2020 అక్టోబర్ 27న స్పెయిన్ లో క్లోత్స్ హ్యావ్ నో జెండర్ క్యాంపెయిన్ ప్రారంభమైంది. ఈ ఉద్యమాన్ని విద్యార్ధుల తల్లితండ్రులు, నెటిజన్లు సమర్ధిస్తున్నారు.
Read Today's Latest Nt-special News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

