Viral Video: నిజమైన నేస్తమని కుక్క నిరూపించింది.. కిడ్నాపర్ల నుంచి యజమానిని కాపాడింది

భోపాల్: నిజమైన నేస్తమని ఒక కుక్క నిరూపించింది. కిడ్నాపర్ల నుంచి యజమానిని కాపాడింది. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన స్థానికులను ఆశ్చర్యపరిచింది. గ్వాలియర్‌లోని అశోక్ నగర్‌కు చెందిన నితిన్ ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. ఇంతలో తెల్లని మారుతీ వ్యాన్‌లో ఐదారు మంది వ్యక్తులు అక్కడకు వచ్చారు. నితిన్‌ను బయటకు పిలిచి అతడితో గొడవకు దిగారు. అనంతరం నితిన్‌పై దౌర్జన్యం చేయడంతోపాటు అతడిని బలవంతంగా వ్యానులోకి ఎక్కించి కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు.
కాగా, తన యజమానికి పొంచి ఉన్న ప్రమాదాన్ని నితిన్ పెంపుడు కుక్క పసిగట్టింది. వెంటనే ఇంటి బయటకు వచ్చి మొరగడం ప్రారంభించింది. జర్మన్ షెపర్డ్ డాగ్ ఆ వ్యక్తులను చుట్టుముట్టి వారిపై దాడికి యత్నించింది. భయపడిన ఆ వ్యక్తులు నితిన్‌ను వదిలేశారు. స్థానికులు గుమిగూడటంతో వారంతా అక్కడి నుంచి జారుకున్నారు. ఆ పెంపుడు కుక్క ఇలా తన యజమాని నితిన్ కిడ్నాప్ కాకుండా కాపాడింది.
మరోవైపు నితిన్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. అయితే అక్కడి సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో యజమానిని రక్షించేందుకు పెంపుడు కుక్క ప్రదర్శించిన ధైర్య సాహసాలను నెటిజన్లు కొనియాడారు.
Read Today's Latest Nt-special News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

