Viral video : అగ్నిప్రమాదంలో సాహసం.. సోదరుడితో 4 అంతస్తులపై నుంచి దూకిన యువతి
fire accident viral video | ఒళ్లు గగ్గురుపొడిచే ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఒక బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం సంభవించగా.. ఒక 18 ఏళ్ల యువతి తన తమ్ముడిని కాపాడుతూ నాలుగో అంతస్తు నుంచి కిందికి దూకింది

ఒళ్లు గగ్గురుపొడిచే ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఒక బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం సంభవించగా.. ఒక 18 ఏళ్ల యువతి తన తమ్ముడిని కాపాడుతూ నాలుగో అంతస్తు నుంచి కిందికి దూకింది. ఇద్దరూ స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటన అమెరికాలోని న్యూయార్క్ నగరంలో జరిగింది.
న్యూయార్క్‌లోని మాన్హాటన్ సమీపంలో ఒక 14 అంతస్తుల బిల్డింగ్‌లో నాలుగో అంతస్తులో గురువారం ఉదయం 7 గంటలకు భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక ఎలెక్ట్రిక్ బైక్‌లోని లిథియమ్ ఐయాన్ బ్యాటరీ పేలడంతో ఈ అగ్ని ప్రమాదం జరిగిందని మాన్హాటన్ అగ్నిమాపక సిబ్బంది తెలిపింది. అయితే ప్రమాద సమయంలో నాలుగో అంతస్తులోని ఒక ఫ్లాట్‌లో ఇద్దరు టీనేజర్లు (అమ్మాయి 18, అబ్బాయి 13) చిక్కుకుపోయారు.
భారీ అగ్గి జ్వాలలు ఎగిసి పడుతుండగా.. ప్రాణాలు కాపాడుకోవడానికి ఆ టీనేజర్లలో ఒకరైన ఆ 18 ఏళ్ల అమ్మాయి కిటికీ బయటనుంచి వేలాడుతూ వచ్చి పక్కనే ఉన్న నీటి పైపులను అందుకుంది. ఆ తరువాత తన తమ్ముడిని కూడా ఆ పైపుల వద్దకు లాగి ముందు అతడిని పైపుల సహాయంతో కిందకు పంపింది. ఆ తరువాత తను కూడా చివరి నిమిషంలో పైపులను పట్టుకొని కొందకు జారుకుంటూ వచ్చి కింద పడింది. ఈ ఘటనని ఒక మీడియా రిపోర్టర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఇప్పుడది తెగ వైరల్ అవుతోంది.
Yesterday morning 2 teens—a 13 and 18-yr-old— escaped a burning building in East Village, NYC. In the video you can see the first teen hanging from the window then stand up and hold on to a pole and help the second person.
— GoodNewsCorrespondent (@GoodNewsCorres1) December 17, 2021
(1/2)
pic.twitter.com/xzHP5QqM2I
లిథియమ్ ఐయాన్ బ్యాటరీ అగ్ని ప్రమాద దుర్ఘటనలు గత కొద్ది కాలంగా ఎక్కువ కావడంతో.. అమెరికా ప్రభుత్వం ఆ బ్యాటరీలను సురక్షిత ప్రదేశాలలో మాత్రమే ఛార్జింగ్ చేయాలని ప్రజలకు సూచించింది.
Read Today's Latest Nt-special News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

