అహ్మదాబాద్ : మీరు ఫైర్ పాన్ గురించి వినిఉంటారు..ఫైర్ పానీపూరీ గురించి మీకు తెలియకపోతే సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోపై లుక్కేయండి. ఈ వీడియోలో అహ్మదాబాద్‌లో మంటలు రేగిన పానీపురిని ఓ యువతి ఎంచక్కా తినేయడం కనిపించింది.
అందరూ ఇష్టంగా తినే స్నాక్‌తో వైల్డ్ ప్రయోగం చేయడం పట్ల నెటిజన్లు తలోరకంగా స్పందించారు. కృపాలిపటేల్ అనే యూజర్ ఈ క్లిప్‌ను ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో పొటాటోలు, సేవ్ నిండిన పానీపూరికి ఓ వ్యక్తి నిప్పుపెట్టి ఫుడ్ బ్లాగర్ నోటిలో పెడుతున్న దృశ్యం కనిపించింది. ఈ క్లిప్‌కు ఇప్పటివరకూ 2 లక్షల వ్యూస్, అసంఖ్యాకంగా కామెంట్స్ వచ్చాయి.