Flying Car | గాల్లో ఎగిరే కార్లపై చాలా రోజులుగా వివిధ దేశాలు పరిశోధనలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే స్లొవేకియాకు చెందిన ఒక కంపెనీ ఎయిర్కార్ను తయారు చేసింది. ఈ కారు ఆకాశంలో 8 వేల అడుగుల ఎత్తులో ఎగురుతుంది.
70 గంటలపాటు టెస్టు ఫ్లైట్ చేసిన అనంతరం ఈ కారుకు ఎయిర్ వర్తీనెస్ సర్టిఫికెట్ ఇస్తూ స్లొవేకియా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో 200 సార్లకుపైగా ఈ కారు ల్యాండయి, టేకాఫ్ అయింది. రోడ్డుపై వెళ్లే కారు నుంచి గాల్లోకి వెళ్లే కారులా మారేందుకు దీనికి 135 సెకన్లు మాత్రమే పడుతుంది.
ఒక స్విచ్ నొక్కడం ద్వారా సాధారణ కారు నుంచి ఎయిర్ కారుగా ఇది మారుతుంది. క్లెయిన్ విజన్ అనే కంపెనీ తయారు చేసిన ఈ ఎగిరే కారు.. త్వరలోనే లండన్ నుంచి పారిస్కు ట్రిప్స్ వేసే అవకాశం ఉందని తెలుస్తోంది. 2017 నుంచి కారును ఈ కంపెనీ అభివృద్ధి చేస్తోంది. ఈ కారుకు స్లోవాక్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ నుంచి ధ్రువీకరణ లభించింది.