Horror Movie Heart Rate Analyst : ఈ హార్రర్ సినిమాలు చూస్తే.. రూ.లక్ష పారితోషకం.. ఆ సినిమాలు ఏంటో తెలుసా?
ఆ హార్రర్ సినిమాలు చూస్తే.. లక్ష రూపాయలు ఇస్తారు | చాలామందికి హార్రర్ జానర్ నచ్చుతుంది. స్పెషల్‌గా హార్రర్ సినిమాలనే చూస్తుంటారు.
చాలామందికి హార్రర్ జానర్ నచ్చుతుంది. స్పెషల్‌గా హార్రర్ సినిమాలనే చూస్తుంటారు. కొందరైతే ఒంటరిగా హార్రర్ సినిమాలను చూస్తారు. కొందరు సినిమా చూస్తూ భయపడినా.. భయపడనట్టుగా నటిస్తారు. అయితే.. టైమ్ పాస్ కోసం హార్రర్ సినిమాలు చూడటం కాదు.. మీరు కనుక.. ఈ హార్రర్ సినిమాలు చూస్తే.. మీకు లక్ష రూపాయల బహుమానం అందజేస్తారు. నమ్మశక్యంగా లేదు కదా. కానీ.. నిజంగానే ఇది నిజం.

కాకపోతే మీరు చేయాల్సిందల్లా కేవలం 10 రోజుల్లో 13 హార్రర్ సినిమాలు చూడాలి. ఈ ఆఫర్ ఇస్తోంది ఎవరో తెలుసా? ఫైనాన్స్‌బజ్ అనే కంపెనీ. Horror Movie Heart Rate Analyst అనే పేరుతో ఈ పొజిషన్‌ను ఫిల్ చేయనుంది.
మరి.. ఈ కంపెనీ ఎందుకు హార్రర్ సినిమాలను చూసేవాళ్లకు డబ్బులు అందిస్తోందంటే.. దాని వెనుక పెద్ద కారణమే ఉంది. హార్రర్ సినిమాల నిర్మాణం కోసం అయ్యే బడ్జెట్‌ను బట్టి.. హార్రర్ సినిమాలను చూసేవాళ్ల భయం, టెన్షన్, ఆందోళన ఉంటుందా? ఎక్కువ బడ్జెట్‌తో తీసే హార్రర్ సినిమాలు తక్కువ బడ్జెట్‌తో తీసే సినిమాల కన్నా ప్రేక్షకుల్లో ఎక్కువ భయాన్ని కలుగజేస్తాయా? లేదా? అనేది తెలుసుకోవడం కోసం ఈ నిర్ణయం తీసుకుందట.
ఊరికే సినిమాలు చూడమంటే ఎవరూ చూడరు కదా. అందుకే.. 13 హార్రర్ సినిమాలు చూసిన వాళ్లకు పారితోషకం కింద 1300 డాలర్లను ఆ కంపెనీ అందించనుంది. అంటే మన కరెన్సీలో సుమారు లక్ష రూపాయలు అన్నమాట.
ఆ సినిమాలు చూసే సమయంలో.. ఫిట్‌బిట్ సాయంతో వాళ్ల హార్ట్ రేట్‌ను మానిటర్ చేస్తారు. అలాగే.. 13 హార్రర్ సినిమాల రెంట్ 50 డాలర్లు కూడా అందిస్తారు.
ఇక.. ప్రేక్షకులు చూడాల్సిన ఆ 13 హార్రర్ సినిమాలు ఏంటంటే.. Saw, Amityville Horror, A Quiet Place, A Quiet Place Part 2, Candyman, Insidious. The Blair Witch Project. Sinister, Get Out, The Purge, Halloween (2018), Paranormal Activity, Annabelle. దీని కోసం ముందే అప్లయి చేసుకోవాలి. 26 సెప్టెంబర్ 2021 చివరి తేదీ. 18 సంవత్సరాలు నిండిన యూఎస్ సిటిజన్స్ ఎవరైనా ఈ పొజిషన్ కోసం అప్లయి చేసుకోవచ్చు. హాయిగా ఇంట్లో కూర్చొని సినిమాలు చేసి లక్ష రూపాయలు సంపాదించుకోవచ్చు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ప్రపంచంలోనే అత్యంత కచ్చితమైన గడియారం ఇది.. విశ్వం గురించి చెబుతున్నదేంటి?
myrtle corbin | నాలుగు కాళ్లు.. రెండు జననేంద్రియాలు.. ఆమె పుట్టుక ఇప్పటికీ మిస్టరీనే
భూమ్మీద సూర్యుడు అస్తమించని ఆ ఆరు ప్రాంతాలేవో తెలుసా?
Read Today's Latest Nt-special News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

