చల్లని.. ఎండాకాలం

ఐదేండ్లలో రికార్డు స్థాయిలో తగ్గిన వేసవి ఉష్ణోగ్రతలు
ఎండాకాలం వచ్చిందంటే చాలు.. ఉక్కపోత, వడగాడ్పులు, ఎండమంటలకు వడదెబ్బలు సహజం. సూర్యప్రతాపాన్ని తట్టుకోలేక విలవిలలాడే పరిస్థితి ఉంటుంది. కానీ ఈ వేసవి వాతావరణం భిన్నంగా ఉంది. వడగాడ్పులు లేవు, ఎండల మంటలు లేవు. చల్లచల్లగా గడిచిపోయింది.
నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి, మే 31:రాళ్లవాన, ఉరుములు, మెరుపుల వానలు, ఈదురుగాలులతో ఈసారి ఎండాకాలం వానాకాలాన్ని తలపించింది. ఉపరితల ఆవర్తనాలు, ద్రోణులు, అప్పుడప్పుడూ అల్పపీడనాలు, యాస్ లాంటి తుఫానుల ప్రబావంతో ఈ సారి ఎండాకాలంలో తరుచూ వానలు కురిశాయి. లానినా ప్రభావం వల్ల ఉపరితల ఆవర్తనాలు, తుఫానులు సంభవిస్తున్నట్టు వాతావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారు.గతేడాది కూడా వడగాలుల ప్రభావం అంతగా లేకపోయినా చాలా ప్రాంతాల్లో పగటి పూట గరిష్ఠ ఉష్ణోగ్రత 43 నుంచి 46 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. జగిత్యాల వంటి ప్రాంతాలలో 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదైంది. ఈసారి మాత్రం ఇప్పటి వరకు నల్లగొండలో పగటి ఉష్ణోగ్రత అత్యధికంగా 43.5 డిగ్రీలుగా నమోదైంది. గత ఐదేండ్లుగా వాతావరణ శాఖ రికార్డులను పరిశీలిస్తే ఈ సారి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చాలా ప్రాంతాల్లో పగటి పూట అత్యధిక ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే రెండు నుంచి మూడు డిగ్రీల వరకు తక్కువగా నమోదయ్యాయి. ఈసారి గాలుల దిశ మారడం వల్ల ఎండల తీవ్రత తగ్గిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న నమస్తే తెలంగాణతో చెప్పారు. సాధారణంగా ప్రతి వేసవిలో ఉత్తర, పశ్చిమ దిశల నుంచి తెలంగాణ వైపు వేడిగాలులు వీస్తాయని, కానీ ఈ సారి బంగాళాఖాతం మీదుగా దక్షిణ, ఆగ్నేయ వాయవ్యం వైపు నుంచి గాలులు రావటం వల్ల ఉష్ణోగ్రతలు తగ్గాయని విశ్లేషించారు. వరుసగా ఉపరితల ఆవర్తనాలు, ద్రోణులు, అల్పపీడనాలు ఏర్పడటం వల్ల గతంలో కంటే ఈ వేసవిలో ఎండల తీవ్రత తగ్గిందని వివరించారు.
తెలంగాణలో మోస్తరు వానలు
నైరుతి రుతుపవనాలు ఈ నెల 3న కేరళలో ప్రవేశించే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సోమవారం తెలిపింది. ఆ తరువాత వారంలో రుతుపవనాలు తెలంగాణలో ప్రవేశిస్తాయని వెల్లడించింది. పశ్చిమ, వాయవ్య దిశల నుంచి గాలులు తెలంగాణలోకి వీస్తున్నాయి. రాబోయే 48 గంటల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. కొన్ని జిల్లాలలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వివరించారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంగా సోమవారం రాష్ట్రంలో కొన్నిచోట్ల తేలికపాటి వానలు కురిశాయి.
గత ఐదేండ్లుగా నమోదైన అత్యధిక ఊష్ణోగ్రతలను విశ్లేషిస్తే …
- 2017 మే 17,19న నల్లగొండలో అత్యధిక ఉష్ణోగ్రత 46.4 డిగ్రీలు
- 2018 మే 21న ఆదిలాబాద్‌లో అత్యధిక ఉష్ణోగ్రత 45.1 డిగ్రీలు
- 2019 మే 24, 29, 30 తేదీల్లో ఉష్ణోగ్రత 46.3 డిగ్రీలుగా రికార్డయింది. (2019 మేలో రామగుండంలో 47.2 డిగ్రీల సెల్సియస్)
- 2020 మే 25, 26 తేదీల్లో 46.3 డిగ్రీల ఉష్ణోగ్రత
- 2021 మే 11 నల్లగొండలో అత్యధిక ఉష్ణోగ్రత 43.5 డిగ్రీలు (తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ ప్రకారం మంథని, పెద్దపల్లిలో అత్యధికంగా 44.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది)
Read Today's Latest Nt-special News in Telugu and Telugu News
- Tags
- cool
- Summer
- Temperatures
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

