పట్టాలపైకి ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ట్రైన్!

బీజింగ్ : గంటకు 600 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మాగ్లెవ్ రైలు చైనాలో మంగళవారం పట్టాలపైకి ఎక్కింది. దేశంలోని తూర్పు ప్రాంతంలోని క్వింగ్డో నగరంలో చైనా ఈ రైలును తయారుచేసింది. బీజింగ్ నుంచి షాంఘైకి వేయి కిలోమీటర్ల దూరాన్ని ఈ ట్రైన్ కేవలం రెండున్నర గంటల్లో చేరుకుంటుంది. విమానంలో ఈ దూరాన్ని చేరుకునేందుకు మూడు గంటల సమయం పడుతుండగా హైస్పీడ్ రైళ్లకు ఐదున్నర గంటల సమయం పడుతోంది.
ఫాస్టెస్ట్ ట్రైన్ వేగాన్ని పరిగణనలోకి తీసుకుంటే 1460 కిలోమీటర్ల పొడవైన ఢిల్లీ, ముంబై మధ్య ఈ రైలు మూడు గంటల్లోపే గమ్యస్ధానాన్ని చేరుకోగలదు. సాధారణ రైళ్లు ప్రయాణించేందుకు అనువైన చక్రాలు, సంప్రదాయ ట్రాక్‌లకు భిన్నంగా ఈ రైళ్లు ట్రాక్‌కు కొద్దిగా పైఎత్తున ఎలక్ర్ట్రోమాగ్నెట్స్ ద్వారా మాగ్నెటిక్ లెవిటేషన్తో ప్రయాణిస్తాయి. అత్యంత ఖరీదైన ఈ రైళ్లను జపాన్, ఫ్రాన్స్, స్పెయిన్, దక్షిణ కొరియా, చైనా వంటి కొద్ది దేశాలే ఈ టెక్నాలజీని వాడుతున్నాయి. చైనా రెండు దశాబ్ధాల నుంచే ఈ టెక్నాలజీని ఉపయోగిస్తున్నా అది పరిమిత స్ధాయిలో ఉంది. ప్రస్తుతం షాంఘై ఎయిర్పోర్ట్ నుంచి సిటీ వరకూ చిన్నపాటి మాగ్లెవ్ లైన్ ఉందని చైనా పత్రిక గ్లోబల్ టైమ్స్ పేర్కొంది.
Read Today's Latest Nt-special News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

