రక్షాబంధన్ స్పెషల్ : ఈ స్వీటు ధర కిలో రూ . 25,000..ప్రత్యేకతలివే..!
ఉత్తరాదిలో పర్వదినాల్లో ప్రజలు ఇష్టంగా తినే ఘెవర్ స్వీట్ ఆగ్రాలోని ఓ స్వీట్ షాప్‌లో కిలో ధర ఏకంగా రూ 25,000 పలుకుతోంది.
లక్నో : ఉత్తరాదిలో పర్వదినాల్లో ప్రజలు ఇష్టంగా తినే ఘెవర్ స్వీట్ ఆగ్రాలోని ఓ స్వీట్ షాప్‌లో కిలో ధర ఏకంగా రూ 25,000 పలుకుతోంది. రక్షా బంధన్ దగ్గరపడుతుండటంతో ఆగ్రాలోని బ్రిజ్ రసాయనం మిస్తాన్ భండార్ అనే స్వీటు షాప్ ప్రత్యేకంగా 24 క్యారెట్ బంగారు పూతతో తయారు చేసిన ఈ స్వీట్‌కు ప్రజల నుంచి ఆర్డర్లు భారీగా వస్తున్నాయి.
ఆర్డర్లపైనే తాము గోల్డెన్ ఘెవర్ స్వీట్‌ను ఆఫర్ చేస్తన్నామని స్వీట్ షాపు యజమాని తెలిపారు. సాధారణంగా ఘెవర్ స్వీట్ కిలో రూ 600 నుంచి రూ 800 మధ్య లభిస్తుంది. ఇక గోల్డెన్ ఘెవర్కు సంబంధించిన వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. రెడ్ బాక్స్‌లో ప్యాక్ చేసిన గోల్డెన్ ఘెవర్ స్వీట్‌ను కస్టమర్లు ఆసక్తిగా చూస్తుండటం వీడియోలో కనిపించింది. డిస్క్ షేప్‌లో ఉండే ఘెవర్ స్వీట్ ప్రధానంగా రాజస్ధాన్, హర్యానా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో తీజ్, రక్షా బంధన్ వంటి పర్వదినాల్లో ప్రజలు ఇష్టంగా తింటుంటారు.
#WATCH उत्तर प्रदेश: रक्षा बंधन को लेकर आगरा में खास तौर पर 'गोल्डन घेवर' बनाए जा रहे हैं। गोल्डन घेवर की कीमत 25,000 रुपए प्रति किलो है। इस घेवर की खासियत ये है कि इसके ऊपर 24 कैरेट के सोने की परत लगाई गई है। pic.twitter.com/cn1AQOyq8X
— ANI_HindiNews (@AHindinews) August 2, 2022
Read Today's Latest Nt-special News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Muscle Growth | 30 ఏళ్లు దాటిన తరువాత కండరాల నిర్మాణం సాధ్యం కాదా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
Election Commission | ఎన్నికల సంఘానికి మాజీ ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల మద్దతు.. 124 మంది బహిరంగ లేఖ
Priyanka Gandhi | ‘దేశంలో ప్రజాస్వామ్యం లేదా..?’ కేంద్ర ప్రభుత్వంపై ప్రియాంకాగాంధీ ఫైర్
నాలుగోసారి ‘మిస్టర్ సింగరేణి’గా రామకృష్ణ
Sonam Wangchuk | నాయకులను రేపటిలోగా విడుదల చేయకపోతే.. నిరాహార దీక్ష చేస్తా: సోనమ్ వాంగ్‌చుక్
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

