పోటెత్తిన వరద : వంట పాత్రలో పెండ్లివేదికకు వచ్చిన వధూవరులు!

అలప్పుజ : కేరళను వరదలు ముంచెత్తడంతో రహదారులు జలమయమయ్యాయి. రోడ్లన్నీ నీట మునిగిన క్రమంలో పెండ్లి ముహుర్తం ముంచుకురావడంతో ఆరోగ్య కార్యకర్తలుగా పనిచేసే కొత్త జంట ఆకాష్, ఐశ్వర్య పెండ్లి మంటపానికి భారీ అల్యూమినియం వంట పాత్రలో కూర్చుని వచ్చారు. తలవడిలోని ఫంక్షన్ హాల్నూ వరద నీరు ముంచెత్తగా అతికష్టం మీద అక్కడికి చేరుకున్న నూతన వధూవరులు పరిమిత అతిధులు, బంధువుల సమక్షంలో పెండ్లి తంతు కానిచ్చేశారు. పెండ్లి మంటపం సైతం నీటితో నిండిపోయింది.
ఇక రోడ్డు జలయమం కావడంతో అల్యూమినియం పాత్రలో వధూవరులు పెండ్లి వేదికకు వస్తున్న దృశ్యాలు పలు టీవీ ఛానెళ్లలో ప్రసారమయ్యాయి. పెండ్లి ముహుర్తం శుభప్రదమైన రోజున ఖరారు చేయడంతో ఎలాగైనా అదే సమయానికి పెండ్లి చేసుకోవాలని తాము నిర్ణయించుకున్నామని నవ దంపతులు చెప్పుకొచ్చారు. గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలతోనే రహదారులతో పాటు పెండ్లి వేదిక నీటమునిగిందని అన్నారు. ఇక నవ దంపతులు ఇద్దరూ చెంగనూర్లోని దవాఖానలో ఆరోగ్య కార్యకర్తలుగా పనిచేస్తున్నారు.
Read Today's Latest Nt-special News in Telugu and Telugu News
- Tags
- Floods
- Kerala
- new couple
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

