అమెరికాలోని ప్రముఖ ప్రాంతాల్లో న్యూయార్క్ టైం స్క్వేర్ ఒకటి. అలాంటి ప్రాంతంలో పంజాబీ డ్యాన్స్ వేసిన ఒక ప్రవాస భారతీయుడి వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దుబాయ్లో భాంగ్రా క్లాసులు చెప్పే హార్డీ సింగ్ అనే వ్యక్తి భాంగ్రా డ్యాన్సర్, ఈ డ్యాన్స్ నేర్పిస్తూ ఉంటాడు. తాజాగా న్యూయార్క్ టైం స్క్వేర్లో పంజాబీ పాటకు డ్యాన్స్ చేస్తూ అల్లరి చేశాడు.
‘నా బకెట్ లిస్టులో ఈ టిక్ కొట్టేస్తున్నా. టైం స్క్వేర్లో డ్యాన్స్ చేశా. ట్రాఫిక్ ఆపేసి రోడ్డు మధ్యలో డ్యాన్స్ చేశా. పర్ఫెక్ట్ షాట్ కోసం గంట సేపు వెయిట్ చేశాం. ఆన్ ది స్పాట్ కొరియో ఇదంతా’ అని ఇన్స్టాగ్రాంలో ఈ వీడియోను క్యాప్షన్ చేశాడు. సోషల్ మీడియాలో షేర్ చేసినప్పటి నుంచి ఈ వీడియోకు 2 లక్షలపైగా వ్యూస్ వచ్చాయి. చక్కగా డ్యాన్స్ చేశారని, చాలా బాగుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.