TCA | కెనడాలో వైభవంగా ఉగాది, శ్రీరామ నవమి వేడుకలు
కెనడాలోని టొరంటోలో ఉగాది పండుగ, శ్రీరామ నవమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెలంగాణ కెనడా అసోసియేషన్ (TCA) ఆధ్వర్యంలో గ్రేటర్ టొరంటోలో జరిగిన ఈ సంబురాలకు తెలంగాణ వాస్తవ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఉగాది పండుగ నాడు పురోహితులు నరసింహాచార్యులు శ్రోతలకు పంచాంగ శ్రవణం చేయగా, శ్రీరామ నవమి నాడు శ్రీకాంత్ కాసర్ల శ్రీ సీతా రాముల కల్యాణ ఉత్సవాలు జరిపించారు.
టొరంటో: కెనడాలోని టొరంటోలో ఉగాది పండుగ, శ్రీరామ నవమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెలంగాణ కెనడా అసోసియేషన్ (TCA) ఆధ్వర్యంలో గ్రేటర్ టొరంటోలో జరిగిన ఈ సంబురాలకు తెలంగాణ వాస్తవ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఉగాది పండుగ నాడు పురోహితులు నరసింహాచార్యులు శ్రోతలకు పంచాంగ శ్రవణం చేయగా, శ్రీరామ నవమి నాడు శ్రీకాంత్ కాసర్ల శ్రీ సీతా రాముల కల్యాణ ఉత్సవాలు జరిపించారు. ఈ సంబురాలను తెలంగాణ కెనడా అసోసియేషన్ ఎగ్జిక్యూటీవ్ కమిటీ ఆధ్వర్యంలో బోర్డు ఆఫ్ ట్రస్టీ, వ్యవస్థాపక సభ్యుల సహకారంతో విజయవంతం చేశారు.

ఈ సందర్భంగా టీసీఏ అధ్యక్షుడు శ్రీనివాస్ మన్నెం మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం వల్ల తెలంగాణ పండుగలు, సాంప్రదాయాలను భావితరాలకు తెలియజేసి ముందుకు తీసుకు వెళ్లడానికి దోహదం చేస్తాయన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో పలువురు పెద్దలు, చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని వారి ప్రతిభను కనబరిచారు. ఇందులో భాగంగా 135 మంది కళాకారులు 23 వినూత్నమైన ప్రదర్శనలతో నాలుగు గంటల పాటు ప్రేక్షకులను అలరించారు.

మునుపెన్నడు లేనివిధంగా 13 ఏండ్లలోపు చిన్నారులకు స్పెల్లింగ్ చాలెంజ్ పోటీలను నిర్వహించారు. ‘బెస్ట్ బ్రెయిన్స్’ అధినేత రమేష్ న్యాయ నిర్ణేతగా వ్యవహరించిన ఈ కార్యక్రమానికి చిన్నారుల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. ఈ వేడుకల్లో గెలిచిన వారందరికీ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి సాంస్కృతిక కార్యదర్శి స్ఫూర్తి కొప్పు సహకారంతో శ్రీరంజని కందూరి, వరుణి గుజ్జుల యాంకరింగ్ చేసి ప్రేక్షకులను అలరించారు. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు లోకల్ బిజినెస్ లని కూడా టీసీఏ ప్రోత్సహిస్తు వస్తున్నది. ఇందులో భాగంగా విభిన్నమైన స్టాల్స్‌ను ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేశారు.

కార్యక్రమానికి విచ్చేసినవారందరికీ ఉగాది పచ్చడి, భక్షాలతో కూడిన రుచికరమైన విందు భోజనం ఏర్పాటు చేయగా, శ్రీరామ నవమి కల్యాణ ఉత్సవాలకు హాజరైనవారికి వడపప్పు, పానకంతో కూడిన పండుగ భోజనాలు ఏర్పాటు చేశారు. శ్రీ సీతా రాముల కల్యాణ ఉత్సవాలను సాంస్కృతిక కార్యదర్శి స్ఫూర్తి కొప్పు సహకారంతో టీసీఏ పాలక మండలి సభ్యుల సహకారంతో విజయవంతం చేశారు.

ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ కమిటీ అధ్యక్షులు శ్రీనివాస్ మన్నెం, ఉపాధ్యక్షులు శంతన్ నారెళ్లపల్లి, కార్యదర్శి శంకర్ భరద్వాజ పోపూరి, సంయుక్త కార్యదర్శి ప్రణీత్ పాలడుగు, కోశాధికారి రాజేష్ అర్ర, సంయుక్త కోశాధికారి నాగేశ్వరరావు దలువాయి, డైరెక్టర్లు శ్రీరంజని కందూరి, కోటేశ్వర్ చెటిపెల్లి, ఆనంద్ తొంట, శరత్ యరమల్ల, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ చైర్మన్ నవీన్ ఆకుల, సభ్యులు పవన్ కుమార్ పెనుమచ్చ, మాధురి చాతరాజు, రాము బుధారపు, వ్యవస్థాపక కమిటీ చైర్మన్ హరి రావుల్, వ్యవస్థాపక సభ్యులు దేవేందర్ రెడ్డి గుజ్జుల, కోటేశ్వర రావు చిత్తలూరి, శ్రీనివాస తిరునగరి, వేణుగోపాల్ రోకండ్ల, రాజేశ్వర్ ఈద, విజయ్ కుమార్ తిరుమలపురం, అఖిలేష్ బెజ్జంకి, ప్రభాకర్ కంబాలపల్లి, ప్రకాశ్ చిట్యాల పాల్గొన్నారు.




Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

