అమెరికాలో పోలీసు వాహనం ఢీ కొని తెలుగమ్మాయి మృతి
అగ్రరాజ్యం అమెరికాలో పోలీసు వాహనం ఢీ కొని ఓ తెలుగమ్మాయి మృతి చెందింది. ఈ ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది.
Accident | అమెరికాలో పోలీసు వాహనం ఢీ కొని ఓ తెలుగమ్మాయి మృతి చెందింది. ఈ ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన జాహ్నవి కందుల (Jaahnavi Kandula) (23) ఉన్నత చదువుల కోసం యూఎస్ వెళ్లింది. అక్కడ సోమవారం రాత్రి 8 గంటల (అమెరికా కాలమానం ప్రకారం) ప్రాంతంలో డెక్స్టర్ అవెన్యూ నార్త్, థామస్ స్ట్రీట్ సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో సౌత్ లేక్ యూనియన్లోని సీటెల్ పోలీసు పెట్రోలింగ్ వాహనం (Seattle Police Patrol Vehicle) ఢీ కొట్టింది. ప్రమాదంలో తీవ్ర గాయాలైన జాహ్నవిని హార్బర్వ్యూ మెడికల్ సెంటర్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ జాహ్నవి మృతి చెందింది.
ప్రమాదానికి కారణమైన అధికారి ఎవరనే వివరాలను పోలీసులు వెల్లడించ లేదు. ఈ ఘటనపై విచారణ మాత్రం జరుపుతున్నామని వెల్లడించారు. సీటెల్ ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి మెడికో టీమ్ వచ్చే లోపు ఆమెను బతికించేందుకు అధికారులు సీపీఆర్ చేశారు. సమాచారం అందుకున్న వైద్యులు ఘటనా స్థలానికి చేరుకుని జాహ్నవి ప్రాణాలను రక్షించే ప్రయత్నం చేశారు. అదేవిధంగా సమీపంలోని హార్బర్వ్యూ మెడికల్ సెంటర్కు తరలించారు. అంతలోనే ఆమె మరణించినట్లు చెప్పారు. సీటెల్ ఫైర్ డిపార్ట్మెంట్ అభ్యర్థన మేరకు డ్రైవింగ్ చేస్తున్న పోలీసు అధికారి ఒక ఎమర్జన్సీ కాల్లో ఉన్నారని పోలీసులు తెలిపారు. ఇక సదరు అధికారి నవంబర్ 2019 నుండి డిపార్ట్మెంట్లో ఉన్నారని, ఢీకొనడానికి దారితీసిన పరిస్థితుల మీద దర్యాప్తు చేస్తున్నారని అంటున్నారు. ఈ సంఘటన గురించి సమాచారం ఉన్న ఎవరైనా 206-684-8923కి కాల్ చేయవలసిందిగా కోరారు.
అమెరికాలో చదువు, ఉద్యోగాల కోసం వెళుతున్న అనేక మంది తెలుగు వారు, భారతీయులూ తరచూ ఇలాంటి ఘటనల్లో చనిపోతూనే ఉన్నారు. జాహ్నవి మరణవార్త తెలుసుకున్న కర్నూలు జిల్లా ఆదోనిలో విషాదం చోటు చేసుకుంది. ఉన్న ఊరు, కన్నవారిని వదిలి ఎక్కడో దేశం కాని దేశంలో బిడ్డ మరణించడంతో ఆమె తల్లదండ్రులు కన్నీరుమున్నీరువుతున్నారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

