వాషింగ్టన్లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
వాషింగ్టన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. విభిన్న సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రాంగణం కళల కాంతులతో మెరిసిపోయింది.
వాషింగ్టన్ : వాషింగ్టన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. విభిన్న సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రాంగణం కళల కాంతులతో మెరిసిపోయింది. ఈ వేడుకలు స్థానిక ప్రవాస తెలంగాణ వాసుల్లో దేశభక్తిని, తెలంగాణ పట్ల అభిమానాన్ని చాటాయి.
కలర్ ఫుల్ క్రియేషన్స్ అధినేత్రి కామసాని అనీలా ప్రదర్శించిన రాణీ రుద్రమ వేషధారణ. నేతన్న కళాకారులకు అండగా రూపొందించిన ప్రత్యేక డిజైన్లతో చేసిన ఫ్యాషన్ వాక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ రాయలసీమ బిడ్డ అయిన అనీలా తెలంగాణ కోడలిగా మా సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా రుద్రమదేవి వేషధారణలో చేసిన ప్రదర్శన అత్యంత ప్రశంసనీయం అని కొనియాడారు. అలాగే సుప్రియ బండి, అనీలా కామసానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎల్ రమణ, వాషింగ్టన్ తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడు రాజేష్ బృందాల, ఇతర అసోసియేషన్ సభ్యులు, ప్రవాస భారతీయులు పెద్దఎత్తున పాల్గొన్నారు. తెలంగాణ అభివృద్ధి, సంస్కృతి, స్వాభిమానాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పేలా ఈ వేడుకలు ప్రదర్శించిన తీరు అందరి ప్రశంసలు అందుకుంది.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

