KCR Birth Day Celebrations | తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జన్మ దినోత్సవ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా జరిగాయి. గురువారం అమెరికాలోని మిన్నెసొటా మిన్నెపొలిస్‌లో ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉల్లాసభరితంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ క్యాంప్‌లో మిన్నెసోటాలో నివాసం ఉన్న తెలంగాణ ప్రజలు రక్తదానం చేశారు.
కేసీఆర్ బర్త్‌డే వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ ఎన్నారైలు.. హ్యాపీ బర్త్‌డే టు కేసీఆర్ అని నినదించారు. ఈ కార్యక్రమానికి ఎన్నారై టీఆర్ఎస్ నాయకుడు, మిన్నెసొటా ఏరియా తెలంగాణ అసోసియేషన్ వ్యవస్థాపకుడు, మాజీ అధ్యక్షుడు నిరంజన్ అల్లంనేని సారధ్యం వహించారు.