Ganesh Chaturthi | సింగపూర్‌లో ఘనంగా వినాయక చవితి వేడుకలు
Ganesh Chaturthi | సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక పీజీపీ హాలులో ప్రతి ఏడాది మాదిరిగానే నిర్వహించిన పూజా కార్యక్రమంలో సుమారు వంద మంది బాలబాలికలు పాల్గొని భక్తిశ్రద్ధలతో బాల గణేశుడిని ఆరాధించారు
Ganesh Chaturthi | సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక పీజీపీ హాలులో ప్రతి ఏడాది మాదిరిగానే నిర్వహించిన పూజా కార్యక్రమంలో సుమారు వంద మంది బాలబాలికలు పాల్గొని భక్తిశ్రద్ధలతో బాల గణేశుడిని ఆరాధించారు. 21 పత్రాలతో గణపతిని పూజించారు. వినాయక చవితి విశిష్టత, తెలుగువారి సంప్రదాయాల గురించి పెద్దల నుంచి తెలుసుకున్నారు. గణపతి పూజ అనంతరం ఉత్సాహంగా లడ్డూ వేలం నిర్వహించారు. ఈ వేలంలో లడ్డూను వీర గ్రూప్ దక్కించుకుంది. ఈ సందర్భంగా సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు బొమ్మారెడ్డి శ్రీనివాసులు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.

వినాయక చవితి పూజలో పాల్గొన్న పిల్లలందరికీ ప్రత్యేకంగా మట్టితో చేసిన బాల గణపతి విగ్రహాలను అందించామని బొమ్మారెడ్డి శ్రీనివాసులు తెలిపారు. అలాగే సుమారు 800 మందికి 21 రకాల పత్రిని ఉచితంగా పంచి తృప్తి చెందామన్నారు. తెలుగు సమాజం నిర్వహించే కార్యక్రమాలకు చేయూతనిస్తూ అందరూ అన్ని కార్యక్రమాల్లో పాల్గొనాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో మరిన్ని ఆకర్షణీయమైన కార్యక్రమాలు రూపొందించబోతున్నామని తెలిపారు.

వినాయక చవితి సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమాన్ని సుమారు 500 మంది ప్రత్యక్షంగా.. 5వేల మంది ఆన్లైన్లో వీక్షించారని కార్యక్రమ నిర్వాహకులు ఆలపాటి రాఘవ వెల్లడించారు. ఈ పూజా కార్యక్రమం విజయవంతం కావడంలో ఎంతోమంది సహాయసహకారాలు అందించారని అన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన కార్యవర్గ సభ్యులకు, దాతలకు, పూజలో పాల్గొన్న వారికి, స్వచ్ఛంద సేవకులకు సమాజం కార్యదర్శి అనిల్ కుమార్ పోలిశెట్టి కృతజ్ఞతలు తెలియజేశారు.


Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

