సింగపూర్‌లో ఘనంగా సంక్రాంతి సంబురాలు
Sankranthi | సింగపూర్ తెలంగాణ కల్చరల్ సొసైటీ వారు సంక్రాంతి సంబురాలను ఆన్లైన్లో జూమ్ ద్వారా కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ వేడుకల్లో సొసైటీ సభ్యులు పండుగ ప్రాముఖ్యతను చక్కగా వివరించారు. పతంగి తయారీ,

సింగపూర్ తెలంగాణ కల్చరల్ సొసైటీ వారు సంక్రాంతి సంబురాలను ఆన్లైన్లో జూమ్ ద్వారా కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ వేడుకల్లో సొసైటీ సభ్యులు పండుగ ప్రాముఖ్యతను చక్కగా వివరించారు. పతంగి తయారీ, బొబ్బెమ్మల తయారీతో పాటు, చిత్ర లేఖనం, పాటలు, నృత్యాల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. దీంతో పాటు ముగ్గుల పోటీలు నిర్వహించి ఆన్లైన్లో ఓటింగ్ ద్వారా ఎన్నుకున్న ముగ్గులకు బహుమతులు అందజేశారు. సంబురాల్లో భాగంగా చిన్నారులు వేసిన హరిదాసు వేషధారణలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
ఈ సందర్భంగా సింగపూర్ కాలమాన ప్రకారం జ్యోతిష్యులచే ప్రత్యేకంగా ముద్రించిన క్యాలెండర్‌ను విడుదల చేయడం జరిగింది. పండుగలను పెద్ద ఎత్తున నిర్వహిస్తూ భావితరాలకు మన పండుగల ప్రాముఖ్యతను తెలియజేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా సంబరాలకు చేయూత, సహాయ సహకారాలు అందిస్తున్న వారందరికి TCSS కార్యవర్గ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సంబురాలను ఆన్లైన్లో వేలాది మంది వీక్షించారు.
సంబరాలు విజయవంతంగా జరగడానికి సహయo అందించిన దాతలకు, స్పాన్సర్స్‌తో పాటు ప్రతి ఒక్కరికి TCSS అధ్యక్షులు నీలం మహేందర్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, సంస్థాగత కార్యదర్శి గడప రమేశ్ బాబు తదితరులు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా రోజారమణి, సునీత రెడ్డి, రజిత గోనె, హరిత విజాపూర్, వందన కాసర్ల మరియు రవి కృష్ణ విజాపూర్ వ్యవరించారు. ఈ కార్యక్రమానికి జూలూరి సంతోశ్ కుమార్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
ఈ సందర్భంగా సొసైటీ కోశాధికారి కల్వ లక్ష్మణ్ రాజు, ఉపాధ్యక్షులు గర్రెపల్లి శ్రీనివాస్, గోనె నరేందర్ రెడ్డి, భాస్కర్ గుప్త నల్ల, మిర్యాల సునీత రెడ్డి, ప్రాంతీయ కార్యదర్శులు దుర్గ ప్రసాద్, జూలూరి సంతోశ్, నంగునూరి వెంకట రమణ, మరియు కార్యవర్గ సభ్యులు నడికట్ల భాస్కర్, శ్రీధర్ కొల్లూరి, పెరుకు శివ రామ్ ప్రసాద్, గార్లపాటి లక్ష్మా రెడ్డి, అనుపురం శ్రీనివాస్, శివ ప్రసాద్ ఆవుల, శశిధర్ రెడ్డి, రవి కృష్ణ విజాపూర్, కాసర్ల శ్రీనివాస్ మరియు ప్రవీణ్ మామిడాల సంబరాల్లో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.

Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mulugu | ములుగు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అరెస్ట్!
Fake Police | పోలీసు అధికారిగా నటిస్తూ కిడ్నాప్‌లు, దోపిడీలు.. రెండు సార్లు జైలుకు వెళ్లినా మారని తీరు
Rajeev Kanakala | భార్య సుమ గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్న రాజీవ్ కనకాల.. వీడియో వైరల్
‘ఏసీబీ ఉచ్చులో ఎస్సై’.. సంచలనం సృష్టించిన ‘నమస్తే తెలంగాణ’ కథనం.. రంగంలోకి నిఘా వర్గాలు!
Upasana | మహిళల విజయంపై ఉపాసన కీలక సందేశం..ఇతర మహిళలను తొక్కేసి విజయం సాధించొద్దు..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

