H1- B Visa | మనోళ్లకు రిలీఫ్.. లాటరీ పద్దతిలోనే హెచ్1 బీ వీసాలు.. జరిగిందేమిటంటే?!
H1- B Visa | అధిక వేతనాలు ప్రాధాన్యంగా హెచ్1 బీ వీసాలు జారీ చేయాలన్న ట్రంప్ నాటి నిబంధనకు యూఎస్ ఫెడరల్ కోర్టు తిప్పికొట్టింది.

H1- B Visa | అమెరికాలో విద్యావకాశాలు.. హెచ్1 బీ వీసాపై ఉద్యోగాలు పొందాలని భావించే భారతీయులకు గుడ్ న్యూస్.. లాటరీ వ్యవస్థకు బదులు అధిక వేతనాల ఉద్యోగాలు ప్రాధాన్యంగా హెచ్1 బీ వీసాలు జారీ చేయాలన్న డొనాల్డ్ ట్రంప్ హయాం నాటి నిబంధనకు యూఎస్ ఫెడరల్ కోర్టు తిప్పికొట్టింది. దీంతో ఉద్యోగాల అన్వేషణలో ఉన్న ఇండియన్ స్టెమ్ విద్యార్థులకు లబ్ధి చేకూరనున్నది.
వేతన ప్రాతిపదికన గ్రాడ్యుయేట్లు అనర్హులు
డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదిత రూల్స్ అమలులోకి తీసుకొస్తే తాజాగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న వారు హెచ్-1 బీ వీసాకు అర్హులు కారు. ఫ్రెష్ గ్రాడ్యుయేట్ల నియామకం కష్టం అవుతుందని అమెరికాలోని వ్యాపార సంస్థలు ఫిర్యాదు చేశాయి. అమెరికా యూనివర్శిటీలు కూడా ట్రంప్ ప్రతిపాదనను వ్యతిరేకించాయి. ట్రంప్ ప్రతిపాదన అమల్లోకి తీసుకొస్తే విదేశీ విద్యార్థుల రాకకు పరిమితులు ఏర్పడతాయని ఆందోళన వ్యక్తం చేశాయి యూనివర్శిటీలు.
యూఎస్ డిస్ట్రిక్ట్ ఫెడరల్ కోర్టులో ఇలా పిటిషన్
ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా యూఎస్ ఫెడరల్ కోర్టులో యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్ పిటిషన్ దాఖలు చేసింది. నూతన రూల్.. ఇమ్మిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్‌ను ఉల్లంఘిస్తోందని ఆరోపించింది. దీంతో న్యాయస్థానం అప్పట్లోనే ట్రంప్ ప్రతిపాదనపై స్టే జారీ చేసింది. తాజాగా తుది తీర్పు చెప్పిన నార్తర్న్ కాలిఫోర్నియా డిస్ట్రిక్ట్ కోర్టు.. అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్స్ యాక్ట్ (ఏపీఏ)ను ట్రంప్ ప్రతిపాదిత రూల్ ఉల్లంఘిస్తుందని పేర్కొంది. సదరు ప్రతిపాదన చట్టబద్ధం కాదని స్పష్టం చేసింది.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
- Tags
- Donald Trump
- h1-b visa
- US
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

