హైదరాబాద్ : భారత్ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) మహిళా రిజర్వేషన్ బిల్లు(Women reservations bill)పై చేస్తున్న ఆందోళనకు డెన్మార్క్ ఎన్ఆర్ఐ(Denmark NRI)లు మద్దతు పలికారు. తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పారని, ఆమె చేపట్టిన ఏ ఉద్యమమైనా సాధించేంత వరకు వదలిపెట్టరని ఎన్ఆర్ఐ ఆకుల శ్యామ్‌బాబు తెలిపారు.
బతుకమ్మ(Bathukamma)ను విశ్వవ్యాప్తం చేయడంలో కవిత పాత్రను ఎవరు విస్మరించలేరని తెలిపారు. గతంలో చేపట్టిన ‘ గిఫ్ట్ ఎ హెల్మెట్’ (Gift a Helmet) పిలుపునందుకుని డెన్మార్క్ లో ప్రచారం చేశామని ఆయన వెల్లడించారు. ఆమె నాయకత్వంలో మహిళలకు చట్టసభల్లో ౩౩శాతం రిజర్వేషన్ బిల్లు ఆమోదం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రిజర్వేషన్ బిల్లుకు జయచందర్ గంట, శ్రీనివాస్ రావు బండారి , ఖాజా అక్తర్ ,రాజశేఖర్ గొల్లపూడి ,కృష్ణ చైతన్య నిమ్మలపల్లి , సుఖ్‌దేవ్ సింగ్, మహిత సంపూర్ణ మద్దతు ప్రకటించారు.